ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు పగడాల సుధాకర్ ముదిరాజ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ముదిరాజుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పగడాల సుధాకర్ ముదిరాజ్ విమర్శించారు. ముదిరాజ్ అంటేనే ముఖ్యమంత్రికి పడటం లేదని ముదిరాజ్ పట్ల చిన్నచూపు చూస్తున్నారని, ముదిరాజులను బిసి డి నుండి ఏలోకి మార్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రత్యేక వృత్తి అంటూ లేని ముదిరాజులను బీసీ డీ నుండి ఏలోకి మార్చడంలో మార్చడానికి అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. గొర్రెలు, బర్రెలు, చేపలు, వంటి వాటితో ముదిరాజుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ముదిరాజ్ ను బీసీలకు చేర్చాల్సిందే నని ఆయన డిమాండ్ చేశారు. అందరి పిల్లల్లాగా మా పిల్లలు అభివృద్ధి చెందాకూడదా అని ఆయన ప్రశ్నించారు. 119 మంది ఎమ్మెల్యేలలో ఒక్క ఎమ్మెల్యే ముదిరాజు ఉంటే ముదిరాజ్ లు అంటే గిట్టని ముఖ్యమంత్రి అతన్ని పార్టీ నుంచి భర్తఫ్ చేశారని, కానీ అతన్ని ముదిరాజులు అక్కున చేర్చుకొని తిరిగి గెలిపించుకొని శాసనసభలో నిలబెత్తారని అన్నారు. అట్టి  ఘనత ముదిరాజులదేనన్నారు. అంతేకాకుండా గణితంలో ఎంపీగా చేసి పార్లమెంట్లోకి పంపిన ముఖ్యమంత్రి అతనితో రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దొరదనానికి ఇది నిదర్శనం అన్నారు. ముదిరాజులు ఏకమైతే ఏమి జరుగుతుందో ముఖ్యమంత్రి గమనించాలని  ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ రోజులు కూడా త్వరలో వస్తాయన్న విషయాన్ని గ్రహించాలన్నారు నమ్మకానికి మారుపేరైన ముదిరాజులు మాటకు కట్టుబడి ఉంటారని నమ్మితే ప్రాణాలు ఇస్తారని ఆయన గుర్తు చేశారు. కొందరు భజన పరుల మాటలు విని ముదిరాజుల పట్ల ముఖ్యమంత్రి చులకన బావం తో చూడడం సరికాదన్నారు తెలంగాణలో 52 లక్షల జనాభా ఉన్న ముదిరాజు లకు చట్టసభల్లో సముచిత  స్థానం కల్పించారని ఆయన అన్ని రాజకీయ పార్టీలను డిమాండ్ చేసారు. ఇప్పటికైనా ముదిరాజులు మేల్కోవాలని మన కులానికి జరిగిన అన్యాయాన్ని ఎండగట్టాలని సంఘటితంగా అందరం ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని సుధాకర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. అంతేకాకుండా బీసీ వర్గాల పట్ల కూడా ముఖ్యమంత్రి వ్యతిరేక వైఖరిని కనిపిస్తున్నారని ఆయన ఆరోపించారు బీసీలకు రుణాలు ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంతవరకు వాటి ఊసు ఎత్తటం లేదని ఆయన పేర్కొన్నారు. బీసీలు అంటే బిచ్చగాళ్లు కాదని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు ముదిరాజులను బిసి-డి నుండి ఏలోకి మార్చ్ మార్చామని చెప్పారని కానీ ఇంతవరకు దాని ఊసే లేదని ఇప్పటికైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి తిరిగి అట్టి ఫైల్ను తెరిచి ముదిరాజులను బిసి డి నుండి ఏలోకి మారుస్తూ జీవోను జారీ చేయాలని సుధాకర్ డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.