డాక్టర్ జీ ఆశయ సాధన ప్రతీ స్వయం సేవకుల లక్ష్యం

... ఆర్ యస్ యస్ విభాగ్ కార్యవాహ నరేష్ జీ

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్స్ వాడ ప్రతినిధి: పరమ పవిత్ర భగవద్వజం గురు స్థానంలో నిలిపి భారత మాత కీర్తి ప్రతిష్టలను కాపాడుతూ సమసమాజ నిర్మాణానికి తనవంతు భాద్యతగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను స్థాపించిన పరమ పూజనీయులు శ్రీ డాక్టర్ కేశవరావు బలిరాం పంత్ హెడ్గే వార్ ఆశయసాధన కోసం ప్రతీ ఒక్క స్వయం సేవకుడు సమసమాజ రక్షణ కోసం తనవంతు భాద్యతగా తన మన ధన పూర్వకంగా సమర్పణ భావంతో స్వయం సేవకులు ఎదగాలనీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ విభాగ్ కార్యవాహ నరేష్ జీ స్వయం సేవకులకు మార్గదర్శనం చేశారు.గత రెండు రోజులు గా25, 26తేదిలలో బాన్స్ వాడ సంభాగ్ పరిధిలో బాలల ప్రశిక్షణ వర్గ కొనసాగుతుంది. సోమవారం ఎస్ ఎస్ ఎల్ డిగ్రీకళాశాల సోమేశ్వర్ గ్రామంలో 8, 9, 10, తరగతుల విద్యార్థుల బాలల ప్రశిక్షణ వర్గ ముంగిపు సమావేశంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని బాల స్వయం సేవకులకు మార్గ నిర్ధేశం చేశారు.రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘము ప్రతీ సంవత్సరం ప్రశిక్షణ వర్గలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో రెండు ప్రదేశాలలో బాలల ప్రశిక్షణ వర్గ నిర్వహించడం జరిగిందన్నారు. సంఘ స్వయం సేవకులను సమాజంలో వ్యక్తి గా పరిపూర్ణ శక్తిగా ఎదగాలంటే శారీరకంగా, మానసికంగా, దృడంగా ఉంటూ క్రమశిక్షణ, సంఘ నిష్ఠతో సమసమాజ నిర్మాణం కోసం పనిచేసేందుకు ఈ సంఘము నిర్వహించే వర్గల ప్రశిక్షణలో పరిపూర్ణ శక్తి వంతులుగా ఎదుగుతారన్నారు. సంఘ నిర్మాత డాక్టర్ జీ ఆశయ సాధనకోసం సంఘశాఖ లో ప్రతీ రోజు స్వయం సేవకులు నిత్య సాధనలో ఒక గంట పాటు నిర్వహించే శాఖ ద్వారా సూర్య నమస్కారాలు, నియుద్ధ, దండ, సమత,శరీరక్ వ్యాయామం,ఆటలు, పాటలు,భవిష్యత్ తరాలకు ఆదర్శనంగా నిలిచేందుకు దేశ భక్తి,సామాజిక విలువలను ప్రతీ నిత్యము శిక్షణ ద్వారా నేర్చుకొంటూ శరీరకంగా దృడంగ ఉంటూ సమాజ హితం కోసం స్వచ్చందంగా పనిచేస్తారన్నారు.కాషాయ భాగవత్ ద్వాజాన్ని గురు స్థానమ్ లో ఉంచి కాషాయ ఛాయలో స్వయం సేవకులు నిత్య సాధన చేస్తారన్నారు.కర్తవ్య నిష్ఠ, దేశభక్తి,నిస్వార్ధ సేవ తత్పరతతో పనిచేస్తూ సమాజ హితం కోసం పనిచేస్తారన్నారు.మొక్కైవంగనిది మ్రానైవంగునా అన్న చందంగా బాలల నుండి యువకులు,వృద్దుల వరకు సంఘ స్వయం సేవకులు దేశం కోసం, సమాజం కోసం ఉన్నతంగా ఎదుగుతారని, ఆజ్ఞలకు బద్దులుగా ధర్మం కోసం అహర్నిశలు పనిచేస్తారన్నారు.డాక్టర్ జీ చుపిన సంఘ సిద్ధాంతాలకు కట్టుబడి నిష్ఠగా సంఘ కార్యాన్ని స్వయం సేవకులు కొనసాగించాలని అయన సూచించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కామారెడ్డి జిల్లా సహా కార్యవాహ సంతోష్, వర్గ కార్యవాహ రాములు, విభాగ్ వ్యవస్థ ప్రముఖ్ బెజుగం సత్య నారాయణ, సంఘ స్వయం సేవకులు, అధికారులు గ్రామస్థులు పుర ప్రముఖులు, 37గ్రామాల నుండి స్వయం సేవకులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.