అమ్మ వసతి గృహం ప్రారంభించిన సీపీ

తెలంగాణా జ్యోతి/ నిజామాబాద్ అర్బన్:
జిల్లా కేంద్రంలోని సూభాష్ నగర్ లో రిటైర్డ్ ఏసీపి, అడ్వకేట్ మనోహర్ శశికళ దంపతులు వారి అమ్మ గారి జ్ఞాపకార్థం నిర్మించిన వసతి గృహాన్ని జిల్లా పోలీస్ కమిషనర్ నాగరాజు బుధవారం అమ్మ వసతి గృహం ను ప్రారంభించారు. దూరపు ప్రాంతాల నుంచి వచ్చి జిల్లా కేంద్రంలో చదువుకునే వసతి గృహ విద్యార్థులకు తక్కువ పైకంతో అన్ని రకాల మౌళిక వసతుల ను కల్పిస్తూ అమ్మ వసతి గృహం ను ఏర్పాటు చేసిన రిటైర్డ్ ఏసీపి అడ్వకేట్ మనోహర్ శశికళ లను సీపీ అభినందించారు. తమ వసతి గృహంను జిల్లా కేంద్రంలో స్థానికంగా విద్యా సంస్థలను దృష్టి లో పెట్టుకొని 150 విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఈ అమ్మ వసతి గృహం లో పోలీసు ఉద్యోగం కోసం ప్రత్యేక కోచింగ్, అన్ని ఆధునిక మౌళిక సదుపాయాల తో ఎలాంటి లాభాపేక్ష లేకుండా సూమారు ఒక్కో విద్యార్థికి రూ.3500 లతో వసతి , భవనం చూట్టు సీసీ కెమెరాలు ఏర్పాటు, విద్యార్థులకు చదువుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు, వేరువేరుగా బాలికలకు,బాలురకు ప్రత్యేక వసతి ఏర్పాట్లు, రుచికరమైన వంటలతో బోజనం, అన్ని రకాలుగా అమ్మ వసతి గృహ నిర్వహణ కోనసాగుతుందని, వసతి గృహ నిర్వాహకులు రిటైర్డ్ ఏసీపి అడ్వకేట్ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీపిలు, సీఐలు, ఎస్సై లు, కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.