ఊరూరా ఘనంగా…దసరా సంబరాలు

తెలంగాణ జ్యోతి/నసురుల్లాబాద్: మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బుధవారం రాత్రి దసరా పండగను గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు జమ్మి చెట్టును పూజించి తర్వాత అందరి సమక్షంలో జమ్మి ఆకులను తెంపుకొని గ్రామంలో ఉన్నటువంటి పలు దేవాలయాల్లో జమ్మి ఆకును సమర్పిస్తూ ఆలయ అర్చకులకు గ్రామ పెద్దలు తమ చేతుల మీదగా జమ్మి ఆకును అందజేశారు, అనంతరం అర్చకులు హారతిని అందుకున్నారు, అనంతరం విజయదశమి పండగను మండల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు, దసరా సందర్భంగా నూతన వస్త్రాలు ధరించి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు, శమి ఆకును ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని దసరా పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు, అనంతరం పలు గ్రామాలలో ప్రజలు, కొత్త బట్టలు ధరించి పాలపిట్టను చూశారు, కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, దసరా పండగను పురస్కరించుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు, ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నసురుల్లాబాద్ మండల్ ఎస్సై రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంతో పాటు ,పలు గ్రామాలలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Leave A Reply

Your email address will not be published.