బాన్సువాడలో కల్లు విక్రయషాపులు ఎన్ని?

.. మామూళ్ళ మత్తులో ఎక్సైజ్‌ అధికారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు ఉపాధి కొరకు తమ వృత్తినే లక్ష్యంగా చేసుకుని బతుకుతున్న గౌడ కులస్థులకు చెట్లు ఎక్కేవారికే టీఎఫ్‌టీ లైసెన్సులు కేటాయించి తద్వారా వచ్చే కల్లుతోనే డిపోలను నిర్వహించాల్సిందిగా నిబందనలు ఉన్నప్పటికి క్షేత్రస్థాయిలో ఈ నిబందనలు ఏవీ డివిజన్‌ స్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు.

.. తిలాపాపం తలా పడికెడు

ప్రభుత్వం ఏర్పర్చిన మద్యంపాలసీ నిబందనల ప్రకారం గీత కార్మికులు చెట్ల ద్వారా వచ్చే కల్లుతో డిపోలు నిర్వహించవలసి ఉండగా కేవలం అక్రమార్జనే ధ్యేయంగా డైజోఫాం, క్లోరోఫాం, కుంకుడుకాయ పులుసుతో డిపోలో కృత్రిమకల్లు తయారు చేస్తూ లక్షల రూపాయల్లో సొమ్ము దండుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆప్కారీ శాఖ అధికారులు కేవలం అధినాయకుల ఒత్తిళ్ళకు తలొగ్గి మామూళ్ళ మత్తులో చూసీ చూడనట్లుగా వ్యవహారించడం గమనార్హం. బాన్సువాడ పట్టణకేంద్రంలో మున్సిపల్‌ పరిధిలో నూతనంగా మహేశ్వరి సినిమా థీయేటర్‌ సమీపంలో వెలిసిన కల్లువిక్రయ కేంద్రానికి అనుమతులు ఉన్నాయా? లేవా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఏదిఏమైనప్పటికి కృత్రిమకల్లు విక్రయాలపై చర్యలు తీసుకోవాలని బాన్సువాడ డివిజన్‌ ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.