బాన్సువాడ డివిజన్ లో జోరుగా కల్తీకల్లు విక్రయాలు

.. పట్టించుకోని ఆబ్కారి శాఖ అధికారులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ డివిజన్ ప్రతినిధి:  రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో మద్యనిషేదాన్ని సైతం ఒకింత ఏర్పర్చినప్పటికి అమలుకు మాత్రం నోచుకోలేదు. ప్రస్థుతం గడిచిన 9’ యేండ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం కేవలం మద్యం ఆదాయంపైనే కొనసాగుతుంది. ఇదిలా ఉండగా పేద, మద్యతరగతి కుటుంబాలు మద్యం సేవించడం వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నప్పటికి ప్రభుత్వం కేవలం ధనార్జనే లక్ష్యంగా వైన్స్‌ యజమానులను, బెల్టుషాపులను ప్రోత్సాహిస్తుండడం కొసమెరుపు గ్రామాల్లో విచ్చల విడిగా మధ్యం అమ్మకాలు రాత్రి ఒంటిగంట వరకు కొనసాగుతున్నప్పటికి ఆబ్కారీ, పోలీసుశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. వివరాల్లోకి వెళ్తే ఓ వైన్స్‌ యజమాని తన వైన్‌షాపును నిర్వహించాలంటే నెలవారీగా ఆప్కారీ, పోలీసుశాఖ అధికారులకు ముడుపులు ముట్టజెప్పాల్సిందే. లేకపోతే సదరు అధికారులు నిబందనల పేరిట తనిఖీలు చేపట్టి వైన్స్‌ యాజమాన్యాన్ని సైతం ఇబ్బందులకు గురిచేస్తారన్నా సమాచారం లేకపోలేదు. ఏదిఏమైనప్పటికి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేష్‌ రాష్ట్రంలో మధ్యం పాలసీని ఏ విధంగా అమలు చేశారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.