కేసీఆర్ ఇలాకాలోకి వచ్చి మరీ తొడగొట్టిన బీఎల్ సంతోష్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కేసీఆర్ ఇలాకాలోకి వచ్చి మరీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక సూత్రధారి బీఎల్ సంతోష్ తొడగొట్టేశాడు. తెలంగాణలోని హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ నాయకుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న బీఎల్ సంతోష్ ఏకంగా ఇక్కడికొచ్చి మరీ హెచ్చరించి వెళ్లడం సంచలనమైంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో  బీఎల్ సంతోష్ కు కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ నోటీసులు పంపింది. కానీ కోర్టును ఆశ్రయించి ఆయన స్టే తెచ్చుకున్నారు. తాజాగా తెలంగాణలో పర్యటించి సంచలన కామెంట్స్ చేశారు.తనపై చేసిన అవాస్తవ ప్రచారానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని.. దీనికి పర్యవసానాలు తప్పదని బీఎల్ సంతోష్ హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగిన అనేక కుంభకోణాలు బయటకు తీసుకురావడానికి బీజేపీ సిద్ధమవుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లోపు సీబీఐ ఐటీ ఈడీ దారులు వ్రమవుతాయని చెప్పుకొచ్చారు.బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కేసీఆర్ తోపాటు బీఆర్ఎస్ నేతలు సిట్ ద్వారా బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయాలని విచారించాలని భావించాయి. కానీ ఆయన స్టే తెచ్చుకొని రాష్ట్రానికి వచ్చి మరీ ఇక్కడ హెచ్చరించడం సంచలనమైంది. భవిష్యత్తులో కేసీఆర్ కు చిక్కులు తప్పవు అంటూ హెచ్చరించడం విశేషం. తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నాయకులకు చుక్కలు చూపించడానికి రెడీ అయినట్లుగా సంకేతాలు పంపారు.తెలంగాణ రాష్ట్రానికి వచ్చి మరీ తొడగొట్టిన బీఎల్ సంతోష్ ను సిట్ అధికారులు కానీ.. తెలంగాణ ప్రభుత్వం కానీ టార్గెట్ చేయలేకపోయారు. కనీసం ఆయన్ను టచ్ కూడా చెయ్యలేకపోయారు. కానీ ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పర్యవసానాలు ఎదుర్కోక తప్పదన్న హెచ్చరికలు జారీ చేసి వెళ్లడం సంచలనమైంది.అయితే రాజకీయాల్లో ఆరితేరిన కేసీఆర్ ను తక్కువ అంచనావేయడానికి లేదు.ఆయన అదును చూసి దెబ్బకొడుతాడు. బీఎల్ సంతోష్ ను కూడా కేసీఆర్ వదిలిపెట్టరని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.