తాగి బండి నడిపితే రూ.10 వేల ఫైన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ (Hyderabad) సిద్ధమైంది. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు యువకుల్లో ఎక్కడా లేని ఉత్సాహం తన్నుకొస్తోంది. 31న రాత్రి స్నేహితులతో కలిసి నానా హంగామా చేయాల్సిందే. అయితే ఈ హంగామా కాస్త ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. మద్యం మత్తులో యువత వాహనాలను రయ్ రయ్ అంటూ దూసుకెళ్తూ రచ్చ రచ్చ చేస్తారు. ఈ క్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ (Drunk & Drive) లపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. తాగి బండి నడిపిన వారికి భారీ జరిమానా వేయాలని నిర్ణయించారు. న్యూ ఇయర్ వేడుకల వేళ ప్రమాదాలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. మద్యం తాగి వాహనాలను నడపొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

మద్యం తాగి వాహనం నడుపుతూ మొదటిసారి పట్టుబడితే రూ.10 వేల ఫైన్ అలాగే 3 నెలల జైలు శిక్ష విధిస్తామన్నారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల ఫైన్ 2 ఏళ్ల జైలు శిక్ష అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ను సస్పెన్షన్ కు రవాణాశాఖకు పంపుతామని హెచ్చరించారు. మొదటి సారి పట్టుబడితే 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తాం రెండోసారి పట్టుబడితే లైసెన్స్ పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. ఎవరూ కూడా మద్యం తాగి వాహనాలు నడపొద్దు. ప్రమాదాలకు గురి కావొద్దని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు.

కాగా హైదరాబాద్ పబ్ లపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 10 తర్వాత డీజేలకు అనుమతి లేదు. ఎప్పటిలాగే 10 తరువాత డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసింది. మరోవైపు ఈవెంట్లలో అసభ్యకర, అశ్లీల డ్యాన్స్ లు, అశ్లీల డ్రెస్సింగ్ లను అనుమతించకూడదని స్పష్టం చేశారు. అలాగే ఈవెంట్లలో సౌండ్ ఆ ప్రాంగణం వరకు వినిపించేలా మాత్రమే చూసుకోవాలని, అవుట్ డోర్ ఈవెంట్స్ లలో డీజేలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. కపుల్స్, సింగర్స్ కోసం ప్రత్యేక ఆవరణలు ఏర్పాటు చేయాలి. గాయకులూ, ప్రదర్శకులు గుంపులో కలిసిపోడానికి అనుమతించకూడదని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.