ఎట్టకేలకు భైరి నరేష్ అరెస్ట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  హిందూ దేవుళ్లపై, అయ్యప్ప స్వామిపై భైరి నరేష్ అనే వ్యక్తి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. అతని వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాపంగా అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడిక్కడ ఆందోళన నిర్వహించి బైరి నరేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో భైరి నరేష్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. వరంగల్ లో నరేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కొడంగల్ పోలీస్ స్టేషన్ కు తరలించనున్నట్టు తెలుస్తుంది. నరేష్ ను అరెస్ట్ చేశాం. చర్యలు తీసుకుంటాం. అయ్యప్ప స్వాములు ఆందోళనలు విరమించుకోవాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ సందర్బంగా ఎస్పీ కోటి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా మీటింగ్ లు పెట్టుకున్నప్పుడు ఇలాంటి వారిని ప్రోత్సాహించవద్దు. అలాంటి వారిని పిలవొద్దని సూచించారు. ఇలాంటి వారిని ప్రోత్సహించే వారిని కూడా వదిలిపెట్టేది లేదన్నారు.  మత విద్వేషాలను ఉపేక్షించేది లేదు. ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఇతరుల మనోభావాలకు ఇబ్బంది కలిగించే విదంగా మాట్లాడిన లేక ప్రవర్తించిన ఊరుకునేది లేదన్నారు.

సైబర్ క్రైమ్ లో కేసు నమోదు

భైరి నరేష్ పై ఇప్పటికే సైబర్ క్రైమ్ లో కేసు నమోదు అయింది. ఐపీసీ 153A కింద అతనిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే నిన్న బైరి నరేష్ మరో వీడియోను అప్ లోడ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ వీడియోలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఐపీ అడ్రెస్ ఆధారంగా అతని ఆచూకీని ట్రేస్ చేస్తున్నారు. ఇక బైరి నరేష్ వ్యాఖ్యలతో తెలంగాణలో వ్యాప్తంగా అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక చోట్ల ఆందోళనలు తెలుపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర బంద్ కు కూడా పిలుపునిస్తామని అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఎస్పీ ఆందోళన ఆపేయాలని అయ్యప్ప భక్తులను కోరారు.

 

Leave A Reply

Your email address will not be published.