శ్వాసకోశ ఇన్ఫెక్షన్ తో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కారణంగా ఆస్పత్రిలో చేరారు. ఆమెను న్యూఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి తరలించారు. యూపీఏ అధ్యక్షురాలిని చెస్ట్ మెడిసిన్ విభాగంలో చేర్చారు. డాక్టర్ అరూప్ బసు అండ్ టీమ్ సోనియా గాంధీకి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో చేర్చిన సమయంలో సోనియాతో పాటు ఆమె కుమార్తె ప్రియాంక వాద్రా ఉన్నారు. సోనియా వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కోసం పరిశీలనలో ఉంచబడింది.సోనియాకు పరీక్షలు చేస్తారు. సర్ గంగారామ్ హాస్పిటల్ చైర్మన్  డాక్టర్ అజయ్ స్వరూప్ ఈ మేరకు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు “యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ ఈరోజు మా ఆసుపత్రిలో చేరారు. ఆమె డాక్టర్ అరూప్ బసు మరియు అతని బృందం సంరక్షణలో చెస్ట్ మెడిసిన్ విభాగంలో చేరింది. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్కి సంబంధించిన పరిశీలన.. చికిత్స కోసం సోనియాగాంధీ చేరారు.’ అని తెలిపారు.ఇటీవల సోనియా గాంధీ.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రాతో కలిసి ఢిల్లీలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమె ఈ అనారోగ్యం బారినపడ్డట్టు సమాచారం. అంతమందిలో నడవడంతో ఆమెకు వైరల్ ఇన్ఫెక్షన్ సోకినట్టుగా అనుమానిస్తున్నారు.సోనియా ఆరోగ్యంపై పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆమె త్వరగా కోలుకోవాలని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య విచారం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.