ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అదిరిపోయే ట్విస్ట్

-  తాజాగా సైంటిస్టు ప్రవీణ్ కుమార్ గొరకవి పేరు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ ఢిల్లీ ప్రభుత్వాలను షేక్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అదిరిపోయే ట్విస్ట్ వచ్చేసింది. ఈ స్కాంలో ఆమ్ ఆద్మీ బీఆర్ఎస్ నేతలతోపాటు ఏపీ ఎంపీ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇప్పటికే పలువురు వ్యాపారులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. పలువురు రాజకీయ నేతల పేర్లు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ కు చెందిన మరో వ్యక్తి పేరు తెరపైకి రావడం సంచలనమైంది.తాజాగా సైంటిస్టు ప్రవీణ్ కుమార్ గొరకవి పేరు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బయటకు వచ్చింది. నిధుల మళ్లింపు విషయంలో ఈడీ ఈ సైంటిస్ట్ ప్రవీణ్ పేరును ఛార్జ్ షీటులో దాఖలు చేసింది. ఈడీ ఛార్జ్ షీటులో కీలక అంశాలను ప్రస్తావించింది. దుబాయ్ కంపెనీతోపాటు ఫ్లై‘ కంపెనీకి నిధుల మళ్లింపు జరిగిందని ఈడీ నిర్ధారణకు వచ్చింది.అసలు ఈ ప్లై కంపెనీ ఓనర్ యే ఈ సైంటిస్ట్ ప్రవీణ్ కుమార్. దీంతో ఈడీ ప్రత్యేకంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రవీణ్ పాత్రపై ఫోకస్ పెట్టింది. ప్రవీణ్ ఆర్థిక లావాదేవీలు.. ఎవరెవరు ఎంతెంత ఈ ఫ్లై కంపెనీకి నిధులు మళ్లించారు అనే విషయంపై ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ స్కాంలో నిధులు హవాలా రూపంలో ప్రవీణ్ కంపెనీకి మళ్లించారు ఈడీ.  గతంలోనూ ప్రవీణ్ ఇంటిపై ఈడీ దాడులు చేసి రూ.24 లక్షలు స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో చిక్కిన సీఏ బుచ్చిబాబుకు ప్రవీణ్ సన్నిహితుడిగా ఈడీ గుర్తించింది.ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి అరెస్టయిన విషయం తెలిసిందే. అలాగే తెలంగాణకు చెందిన శరత్ చంద్రారెడ్డి బినోయ్ బాబు విజయ్ నాయర్ అభిషేక్ బోయినపల్లిలను కూడా  ఈ స్కాంలో నిందితులుగా చేర్చారు.అయితే నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత కూడా ఈ కుంభకోణంలో భాగస్వామి అని ఆమె అత్యధికంగా లబ్ధిపొందుతారని ఎన్ ఫోర్స్ మెండ్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. కవితతో పాటు మాగుంట శ్రీనివాస్ రెడ్డి అతడి కుమారుడు రాఘవ్ రెడ్డి అరబిదో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి పేర్లను కూడా ఈడీ  తన చార్జ్ షీట్ లో తెలిపిందిఇండోస్పిరిట్ సంస్థ అసలు భాగస్వాములు మాగుంట రాఘవ్ రెడ్డి కవిత అని ఈడీ తెలిపింది. ఈ సంస్థకు ఎల్ కింద వచ్చిన షాపుల్లో కవితకు వాటా ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఇండోస్పిరిట్ సంస్థకు చెందిన రామచంద్ర పిళ్లై వెనుక ఉన్నది కవిత అని తెలిపింది. మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాగుంట రాఘవ్ రెడ్డి తుపున ప్రేమ్ రాహుల్ పనిచేస్తున్నారని రిటైల్ లో 14కోట్ల బాటిళ్లను విక్రయించడం ద్వారా రూ.195 కోట్లను సంపాదించినట్లు ఈడీ పేర్కొంది. తాజాగా సీబీఐ కూడా కవితను విచారించింది. సాక్షిగా పేర్కొని నోటీసులు జారీ చేసి విచారించింది.

Leave A Reply

Your email address will not be published.