నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన ఉపాధ్యాయులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:/బాన్సువాడ ప్రతినిధి: బాన్సువాడ SC, ST ఉపాద్యాయ సంఘం అద్వర్యంలో గురువారం ప్రభుత్వ పాఠశాల బాన్సువాడలో ZPHS కోటగిరి మండల తెలుగు ఉపాధ్యాయుడు మల్లికార్జున్ పై జరిగిన దాడికి నిరసనగా నల్ల బ్యాడ్జీ లతో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆయ్యల సంతోష్ మాట్లాడుతూ రాష్ట్ర హోమ్ శాఖ, విద్యాశాఖ వెంటనే స్పందించాలని మతం ముసుగులో దళితులపై దాడులు చేస్తున్న ఉన్మాదులను గుర్తించి అరెస్ట్ చేయాలని రాజ్యాంగాన్ని గౌరవించని సంస్థలను వెంటనే నిషేదించి దాడుల్లో పాల్గొన్నవారిని రిమాండ్ చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు మరియు సిబ్బందికి రక్షణ కల్పించాలి సంబంధిత ఆదేశాలను ప్రభుత్వం వెంటనే జారిచేయాలని, స్థానిక SI సమక్షంలోనే ఉపాధ్యాయుడిపై భౌతిక,భావ దాడి జరిగిన అల్లరిమూకలను అరెస్ట్ చేయకపోవడం సరైందికాదన్నారు.
స్థానిక ప్రధానోపాధ్యాయుడు తన వైఖరిని స్పందించపోవడం సరైందికాదని,  చట్టాన్ని దౌర్జన్యంగా చేతుల్లోకి తీసుకుంటున్న వ్యక్తులను మరియు సంస్థల ప్రతినిధులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసారు. విద్యావ0తులు , ప్రజాస్వామిక వాదులు,మేధావుల నిశ్శబ్దం సరైందికాదని వెంటనే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు లఖ్య, GHS పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాచప్ప, ఉపాద్యాయులు  సాయిలు,మనెమ్మ,విజయ్, శకుంతల, లాల్ సింగ్, రవళి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.