రేవంత్ రెడ్డి తప్పుకుంటారా? కాంగ్రెస్ ను వీడుతారా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:క్రుంగి పోతున్న తెలంగాణ కాంగ్రెస్ ను జాకీలు వేసి లేపడానికి టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ లో ఉత్సాహం ఎంత ఉన్నా అడ్డుకునేందుకు కాంగ్రెస్ సీనియర్లు ముందుంటున్నారు.అసమ్మతి రాజేస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతోంది. ఆ పార్టీని ఇతర పార్టీలు ప్రభావం చేయకముందే సొంత కుంపటిలో చల్లారని అసంతృప్తి నెలకొంది. సీనియర్లు జూనియర్లు విడిపోయిన తరువాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. వీరందరిని ఒక్కటి చేయాల్సిన అధిష్టానం కూడా పట్టించుకోకపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి ఎటువంటి పరిస్థితుల్లో ఉంటుందోనని కేడర్ ఆందోళన చెందుతోంది.ఇటీవల కాంగ్రెస్ లో వివాదాలు ముదిరాయి. సీనియర్లు జూనియర్లు విడిపోయారు. వీరిని చక్కదిద్దేందుకు అధిష్టానం దిగ్విజయ్ సింగ్ ను పంపించినా సమస్య పరిష్కారం కాలేదు. త్వరలో ప్రియాంకా గాంధీ వస్తుందని అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం నిర్వహించిన అందరూ హాజరు కావడం లేదన్నది కనిపిస్తోంది. ఇప్పుడు సీనియర్ల వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డి బాగా హర్ట్ అయ్యారు. అందుకే బరెస్ట్ అయ్యారు.పార్టీలో తన పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేలా సహకరిస్తే ప్రాణాలర్పించేందుకు వెనుకాడబోనని టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బుధవారం ఇక్కడ జరిగిన పార్టీ క్యాడర్కు జరిగిన ఒకరోజు శిక్షణా శిబిరంలో ఆయన కీలకోపన్యాసం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి విభేదాలు లేవని ఉద్ఘాటిస్తూనే.. తెలంగాణ కాంగ్రెస్లో ఎలాంటి విభేదాలు లేవని.. తనకు ప్రయోజనం చేకూర్చే పక్షంలో ఎవరికైనా తన పదవిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు.  “నేను పదవిని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రాహుల్ గాంధీ దేశవ్యాప్త పాదయాత్రతో పోలిస్తే ఇది ఏమీ కాదు. ఐక్యంగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. వారికి డబ్బు మద్యం అక్కర్లేదు కానీ మనం గెలవాలని కోరుకుంటున్నాం’’ అని అన్నారు.కె. చంద్రశేఖర్రావుకు ప్రజలు రెండుసార్లు ఆదేశం ఇచ్చినా ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడంలో విఫలమయ్యారని రేవంత్ అన్నారు. ‘‘కేసీఆర్ చేతిలో మోసపోలేదని భావించే వారు రాష్ట్రంలో ఎవరూ లేరు. ప్రజల నుండి భూమిని లాక్కునే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంతకుముందు రోజు ధరణి పోర్టల్ను అమలు చేసిన తర్వాత లక్షల మంది నష్టపోయారని రేవంత్  ఆరోపించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు 19.88% వృద్ధిని సాధించాయని రావు ప్రభుత్వం 12.55% సాధించిందని ఆయన అన్నారు.ప్రస్తుతం రేవంత్ ను బలపరిచిన మాణిక్యం ఠాగూర్ ను ఎలాగోలా లేపేశారు కాంగ్రెస్ సీనియర్లు. ఇప్పుడు తమ ఒత్తిడికి తలొగ్గిన అధిష్టానానికి రేవంత్ ను కూడా లేపాలని చూస్తున్నారు. అందుకే రేవంత్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను పదవిని కోల్పోవడానికి కూడా సిద్ధం అంటూ వైరాగ్యపు మాటలు మాట్లాడారు. సో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి తప్పుకుంటారా? కాంగ్రెస్ ను వీడుతారా? అన్న చర్చ మొదలైంది.

Leave A Reply

Your email address will not be published.