రైతు రాములు ఆత్మహత్యకు నిరసనగా రైతుల కలెక్టరేట్ ముట్టడి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. యువ రైతు రాములు ఆత్మహత్యకు నిరసనగా పెద్ద ఎత్తున రైతులు కలెక్టరేట్ ముట్టడికి బయల్దేరారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. కామారెడ్డి మున్సిపాలిటీ తీసుకొచ్చిన మాస్టర్ ప్లాన్‌తో భూములు నష్టపోయిన రైతుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. చర్చి గ్రౌండ్ నుంచి భూ బాధితుల ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీకి భారీగా అన్నదాతలు తరలివచ్చారు. మరోవైపు పోలీసులు కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో బారికేడ్లను తోసుకుని కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు  మాట్లాడుతూ మాస్టర్ ప్లాన్‌ కు వ్యతిరేకంగా రైతులు శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నారని అన్నారు. హరీష్‌రావు వస్తే కామారెడ్డి మొత్తం తిరిగిన కలెక్టర్.. బయటకు వచ్చి రైతుల నుంచి వినతిపత్రం ఎందుకు తీసుకోవడం లేదుఅని రఘునందన్‌రావు ప్రశ్నంచారు. రైతుల సహనాన్ని పరీక్షించవద్దనికలెక్టర్ వచ్చి వెంటనే వినతిపత్రం తీసుకోవాలని రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.ఈ ర్యాలీలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావుబీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డిఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిఎల్లారెడ్డి కాంగ్రెస్ ఇంచార్జి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.