ముఖ్యమైన  రంగంగా  ప్రభుత్వం  ఫుడ్  ప్రొసెసింగ్  రంగం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్ర  ముఖ్యమంత్రి  కె.  చంద్రశేఖర్  రావుగారి  విజన్  మేరకు  ప్రభుత్వం  సాగునీరు,  విద్యుత్,  వ్యవసాయ  రంగం  పై  ప్రత్యేక  శ్రద్ద  వహించడంలో  తెలంగాణ  రాష్ట్రం  ధాన్యాగారం  గా  ప్రసిద్దికెక్కి  ధాన్యం  ఉత్పత్తిలో  గణనీయమైన  పురోగతి  సాధించి వ్యవసాయ తెలంగాణ గా అవతరించింది .  వ్యవసాయంతో  పాటు  అనుబంధ  రంగాలైన  పాడి,  పౌల్ట్రీ,  లైవ్  స్టాక్  లలో  ఉత్పత్తి  పెరగడంతో  ప్రభుత్వం  ఫుడ్  ప్రొసెసింగ్  రంగాన్ని  ముఖ్యమైన  రంగంగా  గుర్తించింది.  ప్రభుత్వం  ఫుడ్  ప్రొసెసింగ్  రంగంలో  పెట్టుబడుల  ఆకర్షణకు  అవసరమైన  అన్ని రకాల మౌలిక  సౌకర్యాలు  కల్పించడంతో  దేశీయ  ,  అంతర్జాతీయ  పెట్టుబడులు  పెరిగాయి  . స్థానికంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటుధర కల్పించడం, వాటిని ఆన్ డిమాండ్ గా  అమ్ముకోవడం, మిగిలిన పంటను ఆహార కేంద్రాల్లో ప్రాసెసింగ్ చేస్తారు. దీంతో మహిళాసంఘాలకు ఉపాధి అవకాశాలు పెంపొందించడం, రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీలేని ఆహార ఉత్పత్తులను అందించడం, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళుతున్నది. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు ద్వారా నిరుద్యోగ సమస్యకు పరిష్కారం ఏర్పడింది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డేటా ప్రకారం రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల స్థిర మూలధనం రూ. 4436 కోట్లు. 2021 నాటికి ఇది 53% పెరిగి రూ.6812 కోట్లకు చేరుకున్నది. 2022-23లో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ( ప్రత్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్) కు అదనంగా 2022-23  లో  ఫుడ్  ప్రొసెసింగ్  జోన్లలో  మరో  2396  కోట్ల  పెట్టుబడుల  ప్రక్రియ  పురోగతిలో  ఉంది.  రూ.  2500  కోట్లకు  పైగా  పెట్టుబడులతో  పలు  మెగా  ప్రాజెక్టులు  అండర్  ఇంప్లిమెంటేషన్  లో  ఉన్నాయి.  దీనితో  ఈ  రంగంలో  స్థిర మూలధనం  రూ.  10  వేల  కోట్లను  దాటే  అవకాశం  ఉంది.  రాష్ట్రం  ఏర్పడే  నాటికి  ఉన్న  స్థిర మూలధనం రెట్టింపుకు  చేరుకున్నాయి.    TS  I  PASS  డాటా  ప్రకారం  ఫుడ్  ప్రొసెసింగ్  సెక్టార్  లో  2017  నుండి  2021  వరకు  2140  యూనిట్ల ద్వారా  2376  కోట్ల  పెట్టుబడి పెట్టడం వలన 29841  మందికి  ఉద్యోగాలు  లభించాయి.  ఆయిల్  మిల్స్,  రైస్  మిల్స్  ,  డైరీ  యూనిట్స్  ,  స్పైస్  ప్రాసెసింగ్  యూనిట్లలో  పెట్టుబడులు  చేశారు.యువతకు ఉపాది అవకాశాలు కల్పించడంతో పాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువలను జోడించి రైతులను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యంగా 2021  లో  రాష్ట్ర  ప్రభుత్వం  స్పెషల్  ఫుడ్  ప్రాసెసింగ్  జోన్  ఏర్పాటును  ప్రారంభించడంతో పాటు ఫుడ్  ప్రాసెసింగ్  పాలసీ  ని  ప్రకటించింది.  రాష్ట్ర  వ్యాప్తంగా  7150  ఎకరాలలో  21  స్పెషల్  ఫుడ్  ప్రాసెసింగ్  జోన్  లను  అన్ని  సౌకర్యాలతో  ఏర్పాటు  చేసింది.నవంబర్  2022  నాటికి  రూ.2396  కోట్ల  పెట్టుబడికి  సంబంధించి  1496  దరఖాస్తులు  రాగా  3038  ఎకరాలకు  సంబంధించి  1031  ఆలాట్మెంట్  ఆర్డర్  లను  జారీ  చేయడమైనది.  రైస్  మిల్స్,  ఎథనాల్  అథారిటీ  పరిశ్రమలు,  డైరీ  ,  ఆయిల్  ప్రాసెసింగ్  యూనిట్  లలో  ఎక్కువగా  పెట్టుబడులు  నమోదయ్యాయి. మైక్రో  ఫుడ్  ప్రాసెసింగ్  ఎంట్రప్రేన్యూర్  యూనిట్ల  ఏర్పాటుకు  ప్రోత్సాహకంగా  రూ.  10  లక్షల  వరకు  గ్రాంట్  ఇన్  ఎయిడ్  ప్రభుత్వం  తోడ్పాటునిస్తున్నది.  నవంబర్  2022  నాటికి  834  మైక్రో  ఫుడ్  ప్రాసెసింగ్  యూనిట్స్,  కోలాటెరల్ ఫ్రీ  లోన్  ,  క్యాపిటల్  గ్రాంట్  మంజూరయ్యాయి.  ఈ  యూనిట్లు  ప్రారంభానికి  సిద్దంగా  ఉన్నాయి.  వీటితో  పాటు  మరో  3132  దరఖాస్తుల  అనుమతుల  మంజూరు  ప్రాసెస్  లో  ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.