లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/సంగారెడ్డి ప్రతినిధి:  సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు పట్టణ పరిధిలోని జి ఎం ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో జీ ఓ నంబర్ 58 ద్వారా పటాన్ చెరు

నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 738 మంది లబ్ధిదారులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు శుక్రవారం ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన నియోజకవర్గం పటాన్చెరు. ఒక్క రూపాయి కర్చు లేకుండా పూర్తి పారదర్శకతతో పట్టాలు పంపిణీ చేశారు. జిల్లా, మండల స్థాయి అధికారులకు అభినందనలు తెలిపారు.  జిల్లాలో 830 మందికి జి ఓ నంబర్ 58 ద్వారా ఇళ్ల పట్టాలు పంపిణీ చేసాము. నేటి నుండి ఇంటి యాజమానుల గా మారారు. ఇంటింటికి రక్షిత మంచినీరు అందించిన ఘనంగా బి అర్ ఎస్ పార్టీ ది అని కొనియాడారు. పేదల కోసం రాష్ట్రంలోని అత్యధికంగా పటాన్చెరు నియోజకవర్గం లో 13 బస్తీ దవకనాలు ఏర్పాటు చేశాను. రాబోయే నెల రోజుల్లో జి ఓ నంబర్ 59 ద్వారా ఇళ్ల పట్టాలు అందిస్తాం. ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని, బి ఆర్ ఎస్ పార్టీ ని. నిండు మనస్సుతో ఆశీర్వదించాలనీ కోరుకుంటున్నా అన్నారు.  హాజరైన మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, టి ఎస్ ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ శరత్, స్థానిక ప్రజాప్రతినిధులు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.