రక్తదానం మహా దానం..తోటివారికి ప్రాణదానం

- తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అద్యక్షులు  పద్మాచారి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/హైదరాబాద్: అమీర్ పెట్ లోని ధరమ్ కరమ్ రోడ్డులో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో, టిఎస్కే ట్రస్ట్ చైర్మన్ మధుసూదన్  ఆధ్వర్యంలో, రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో, బ్లడ్ డోనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ ఎ. పద్మాచారితో పాటు, ఎడిటర్ ట్రావెలర్ టైమ్స్ సాయి కాంత్ విచ్చేసి రిబ్బన్ కట్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధుకర్ హెడ్ మాస్టర్, సుందర్ కల్లూరి,నటరాజ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏ పద్మాచారి మాట్లాడుతూ డబ్బుదానం చేయవచ్చు.. అన్నదానం చేయవచ్చుకానీ.. అన్ని దానాల కంటే ముఖ్యమైనది రక్తదానం. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఓ మనిషిని బతికిస్తుంది రక్తం. రక్తం అవసరమైనవారికే కాదు దానిని దానం చేసే దాతలకూ ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. రక్తదాతలకు సాటి మనుషుల ప్రాణాలు కాపాడే అవకాశం లభిస్తుంది. ఇది సాటిలేని సంతృప్తిని ఇస్తుందన్నారు. ఇంటగొప్ప కార్యక్రమాన్నీ స్కూల్ లో నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకం అన్నారు. టీచర్లు విద్యారులకు రక్తదానం యొక్క గొప్పతనాన్ని వివరించి, వారి మిత్రులతో, వారి తల్లితండులతో రక్త దాన విశిష్టతను వివరించలన్నారు.

Leave A Reply

Your email address will not be published.