యూఎన్ మిష‌న్‌లో భాగమైన భార‌త్‌కు చెందిన అతిపెద్ద‌ మ‌హిళా బెటాలియ‌న్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భార‌త్‌కు చెందిన అతిపెద్ద‌ మ‌హిళా బెటాలియ‌న్ ఇప్పుడు యూఎన్ మిష‌న్‌లో భాగం కానున్న‌ది. యునైటెడ్ నేష‌న్స్ ఇంటీరియ‌మ్ సెక్యూర్టీ ఫోర్స్‌(యూఎన్ఐఎస్ఎఫ్ఏ)లో భాగ‌మైన భార‌త వుమెన్ పీస్‌కీప‌ర్స్ ప్లాటూన్ సుడాన్‌లోని అబేయ్ ప్రాంతంలో విధులు నిర్వ‌ర్తించ‌నున్న‌ది. యూఎన్ ప్రోగ్రామ్‌లో పాల్గొంటున్న అతిపెద్ద భార‌తీయ మ‌హిళా యూనిట్ ఇదే కావ‌డం విశేషం.గ‌తంలో 2007లో లిబేరియాలో భార‌త మ‌హిళా ద‌ళం విధులు నిర్వ‌ర్తించింది. లిబేరియాలో ఆ మ‌హిళా ద‌ళం 24 గంట‌ల పాటు గార్డు డ్యూటీ చేసింది. రాజ‌ధాని మోన్‌రోవియాలో రాత్రి పూట పెట్రోలింగ్ నిర్వ‌హించారు. తాజా భార‌త మ‌హిళా బృందంలో ఇద్ద‌రు ఆఫీస‌ర్లు ఉంటారు. మ‌రో 25 మంది ఇత‌ర ర్యాంక్‌ల వాళ్లు ఉంటార‌ని తెలిపారు.సుడాన్‌లోని అబేయ్ ప్రావిన్సులో విధులు చేప‌ట్ట‌డం స‌వాల్‌తో కూడుకున్న ప‌ని. అక్క‌డ తాజాగా జ‌రిగిన హింస వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యం హింస జ‌రిగే ప్రాంతంలో మ‌హిళా ద‌ళాల‌ను మోహ‌రించ‌డం స‌వాలే. కానీ యూఎన్ పీస్ కీపింగ్ మిష‌న్‌కు మ‌న‌ బృందాన్ని పంప‌డం గొప్ప విష‌యం.1948 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 71 యూఎన్ పీస్‌కీపింగ్ మిష‌న్ల‌ను నిర్వ‌హించారు. దాంట్లో 49 మిష‌న్ల కోసం సుమారు రెండు ల‌క్ష‌ల మంది భార‌తీయుల్ని పంపారు. యూఎన్ పీస్‌కీపింగ్ ప్రోగ్రామ్‌కు భార‌తీయ‌ మ‌హిళ‌ల్ని పంపే సాంప్ర‌దాయం 1960 నుంచి ఉంది. పీస్‌కీపింగ్ మిష‌న్‌లో భార‌తీయ మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంది. డాక్ట‌ర్ కిర‌ణ్ బేడీ, మేజ‌ర్ సుమ‌న్ గ‌వాని, శ‌క్తి దేవి లాంటి వాళ్లు యూఎన్ పీస్‌కీపింగ్‌లో చేశారు

Leave A Reply

Your email address will not be published.