వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష

- మంత్రి నిరంజన్‌ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కరోనా సమయంలో కూడా రైతుబంధు ఆపలేదని చెప్పారు. వందశాతం ధాన్యం కొనుగోలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను వియవంతంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వంపై విమర్శలు చేయడమే విపక్షాలు పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు.నిధుల విడుదల ప్రకియ కొనసాగుతున్నది. పెట్టుబడి సాయం కింద 8లక్షల 53 వేల 409.25 ఎకరాలకు రూ.426.69 కోట్ల నిధులను ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. వీటిని 1,87,847 మంది రైతుల ఖాతాలో నిధులను జమచేసింది. ఇప్పటివరకు 56,58,484 మంది రైతుల ఖాతాల్లో రూ.475.64 కోట్లు జమయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.