2023 సెప్టెంబర్ లో ఏపీలో ముందస్తు ఎన్నికలు..

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  రాజకీయాల్లో ఎత్తులు అనేవి ఒకరికే సొంతం కావు. పై ఎత్తు వేసేవారు కూడా ఉంటారు. అధికారంలో ఉన్న వారు తమకు అనుకూలంగా సమయం చూసుకుని విపక్షాలను ఏమరుపాటుకు గురి చేసి ఆ అయోమయంలో తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటారు. అలా తమకు కలసివస్తుంది అనుకుంటే కొన్ని నెలల పదవీకాలాన్ని కూడా త్యాగం చేసి మరీ ముందస్తు అంటారు.అలా తెలంగాణాలో కేసీయార్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి భారీ రాజకీయ లబ్ది పొందారు. ఇపుడు అదే బాటలో నడవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అనుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు అని చాలా కాలంగా అంతటా వైరల్ అవుతున్న న్యూస్. ముందస్తు ఎందుకు షెడ్యూల్ ప్రకారమే తాము ఎన్నికలకు వెళ్తామని వైసీపీ కీలక నాయకుడు సజ్జల రామక్రిష్ణారెడ్డి చెబుతున్నా కూడా డౌట్ల మీద డౌట్లు అధికార వైసీపీనే కల్పిస్తోంది.తమ పార్టీ ఎమ్మెల్యేలను గడప గడపకూ పంపించడం వర్క్ షాప్స్ పెట్టడం టికెట్ల విషయంలో కూడా ఇప్పటి నుంచే కొందరికి కన్ ఫర్మ్ చేయడం ఇవన్నీ కూడా ఏపీలో ఎన్నికల వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయి. నిజానికి రాజకీయ గండర గండ చంద్రబాబు ఈ ముందస్తు ఎన్నికల వాసనలను బాగానే పసిగట్టారు అని అంటారు.అందుకే ఆయన కరోనా వేవ్ తగ్గగానే జిల్లాల టూర్లు పెట్టుకున్నారు. గత ఏడాదిగా ఆయన జిల్లాలకు వెళ్తూ తెలుగుదేశాన్ని పటిష్టం చేస్తూ వస్తున్నారు. అదే టైం లో లోకేష్ పాదయాత్రకు కూడా డిజైన్ చేశారు. ఎక్కడా ఏ మాత్రం అధికార వైసీపీకి స్కోప్ ఇవ్వకుండా బాబు దూకుడుగా తన పని తాను సాగిస్తున్నారు. ఇక జనసేన వీకెండ్ పాలిటిక్స్ చేస్తూ వస్తోంది. పవన్ సినిమా షూటింగుల వల్ల అలా జరుగుతుంది.అయితే జనసేన పొత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే పెద్దగా తొందరపడడం లేదు అని అంతా అనుకుంటున్నారు. దాన్నే నిజం చేసేలా పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉన్న చంద్రబాబు ఇంటికి వెళ్ళి మరీ ఆయనతో ప్రత్యేకంగా భేటీ వేశారు. ఇంత హడావుడిగా ఈ ఏకాంత భేటీ వేయాల్సిన అవసరం ఏంటి అంటే ముందస్తు ఎన్నికల విషయంలో ఇద్దరు నేతలకూ కచ్చితమైన సమాచారం ఉండడమే అని అంటున్నారు.ఇప్పటి నుంచే పొత్తుల విషయం ఖరారు చేసుకుని సీట్ల పంచాయతీని తేల్చుకుంటేనే తప్ప మరో తొమ్మిది నెలలలో జరగబోయే ఎన్నికలకు ప్రిపేర్ కావడం జరగదు అని రెండు పార్టీల అధినాయకత్వాలు భావిస్తున్నారు అని అంటున్నారు. ఒక విధంగా చంద్రబాబు పవన్ బాగానే అలెర్ట్ అయ్యారని అంటున్నారు. అదే టైం లో ముందస్తు ఎన్నికలు పెట్టి పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్న జగన్ కి చెక్ పెట్టే దిశగానే ఈ ఇద్దరు నేతలూ భేటీ అయి సీరియస్ గా ఆలోచించారని అంటున్నారు.ఈ ఇద్దరు నేతల వద్ద ఉన్న కీలక సమాచారం ప్రకారం 2023 సెప్టెంబర్ లో ఏపీలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి అంటున్నారు. దాని కోసం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది కాబట్టే బాబు పవన్ అర్జంట్ గా భేటీ అయ్యారని టాక్ నడుస్తోంది. మొత్తానికి ఈ భేటీ అనివార్యంగానే జరిగింది అంటున్నారు. ఏపీ రాజకీయాల్లో పై చేయి సాధించే దిశగానే ఇద్దరు నేతలు ఒక్క చోట చేరారు అని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.