ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి బి ఎల్ వర్మ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఖమ్మం జిల్లాలో కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి బి ఎల్ వర్మ మంగళవారం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్లమెంట్ ప్రవాస్ యోజన లో భాగంగా పర్యటిస్తున్నారని గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & పార్లమెంట్ ప్రవాస్ యోజన రాష్ట్ర కన్వీనర్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నేడు (10 జనవరి 2023న) సాయంత్రం 6 గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరుగుతున్న సమావేశానికి పార్లమెంట్ వ్యవహారాలు బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహల్లాద జోషి వర్చువల్ (వీడియో కాన్ఫరెన్స్) ద్వారా ప్రసంగించనున్నారని, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సునీల్ బన్సల్ రేపు ఎల్లుండి రెండు రోజులపాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారని, రేపు(11 జనవరి 2023న )ఉదయం 10 గంటలకు కూకట్పల్లిలో జరగనున్న మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం సమావేశంలో పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొంటారు. రేపు(11 జనవరి 2023న) మధ్యాహ్నం మూడు(3) గంటలకు బిజెపి రాష్ట్ర కార్యాలయంలో జరగనున్న పార్లమెంట్ కన్వీనర్ సహ కన్వీనర్, పార్లమెంటు ప్రభారి, పార్లమెంట్ విస్తారక్ సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్, మరియు బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొంటారని, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు & పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్  ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తారన్నారు. అదేవిదంగా ఎల్లుండి (12 జనవరి 2023న) ఉదయం 11 గంటలకు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం పటాన్చెరులో, మధ్యాహ్నం మూడు(3) గంటలకు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ పాల్గొంటారు. ఈ రెండు రోజుల పర్యటనలో పార్టీ పటిష్టత, ప్రజా సమస్యల పరిష్కారం కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం తదితర విషయాలపై చర్చించడం జరుగుతుంది. భవిష్యత్ కార్యక్రమాలు, రాష్ట్రంలో టి ఆర్ ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు తదితర వాటిపై ప్రజా ఉద్యమాలను చర్చించడం కార్యరూపంలోకి తీసుకురావడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.