అధికారులు చట్టాలను అమలు చేయకపోవడం నేరం

- ప్రాజెక్ట్ కోసం సేకరించిన భూమిని వినియోగించు కోలేక పోతే అట్టి భూమిని తిరిగి ఆ రైతులకే ఇవ్వాలి - రైతులకు న్యాయం అందించడం కోసం ప్రజాసంఘాలు ముందుకు రావాలి -  లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకులు డా. జయప్రకాష్ నారాయణ పిలుపు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజాస్వామ్యంలో చట్టాలు అమలు చేయడమే ప్రభుత్వాలకు శిరోధార్యం కావాలని లోక్ సత్తాపార్టీ వ్యవస్థాపకులు  డా.జయప్రకాష్ నారాయన్ అన్నారు. ఈ రోజు స్థానిక సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని జరిగిన భూనిర్వాసితులతో జయప్రకాష్ నారాయణ ముఖాముఖి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ ముఖాముఖి కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసు అధ్యక్షత వహించారు.ప్రభుత్వాలు , అధికారులు చట్టాలను అమలు చేయకుండా ఉల్లంఘించడం నేర సమానమని జేపీ అన్నారు. ఏ ప్రాజెక్ట్ కోసం ఐతే భూమిని సేకరిస్తారో ఆ ప్రయోజనం కోసం భూమిని వినియోగించు కోలేక పోతే అట్టి భూమిని ఆ రైతులకే తిరిగి ఇవ్వాలని అడ్డు చెప్పరాదని ఆయన అన్నారు. చిత్తశుద్ధితో రైతులకు న్యాయం అందించడం కోసం ప్రజాసంఘాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రభుత్వానికి ఒక ఎకరం కావాల్సి ఉంటే రెండు ఎకరాలు సేకరించి అవసరానికిపోను మిగతా ఎకరం అభివృద్ధి పరిచి భూనిర్వాసితులకు అందజేయాలని జేపీ  సూచించారు. చట్టాలు అమలుచేయడంలో అధికారులు చట్టాలను ఉల్లంఘించకుండా పటిష్టంగా అమలు బాధ్యత అధికారులదేనని జేపీ స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్ ల కింద భూములు, ఇండ్లు, ఉపాధి కోల్పోయిన నిర్వాసితులు పాల్గొనగా జేపీ సూచన మేరకు రాష్ట్రంలోని భూనిర్వాసితుల సమస్యలు – పరిష్కారాలపై  అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మణపల్లి ప్రకటించారు. సభ్యులుగా హాయాతుద్దిన్, నర్సింహారెడ్డి, బద్దం రాజీ రెడ్డి, మారుతి రావు, రాజ గోపాల్ రావులు ఉంటారని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నందిపేట రవీందర్ , తీగాలపల్లి రంగాచారి, కారుమంచి గణేష్, శివరామ కృష్ణా, వంగాల రంగా చారి, వీరేష్, మహేందర్, మల్లన్నసాగర్, అంతగిరి, గౌరెల్లి, రంగనాయక సాగర్, కొండ పోచమ్మ, దేవాదుల, దిండి, జాతీయ రహదారుల భాదితులు   భూమయ్య, దుర్గారెడ్డి, శ్రీనివాసు, గడీల రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, శ్రీనివాసు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.