మహిళలకు మేలు కలగాలంటే  33శాతం  రిజర్వేషన్లు అమలు చేయాలి

- బిసి ఉద్యమ నాయకురాలు మట్ట జయంతి గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహిళలు దేంట్లో కూడా తక్కువ కాదని, మహిళలకు మేలు కలగాలంటే,మహిళలకు 33శాతం  రిజర్వేషన్లు ఇవ్వాలని అందుకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పార్లమెంటులో వెంటనే ప్రవేశ పెట్టి మహిళలకు న్యాయం చేయాలని బిసి ఉద్యమ నాయకురాలు మట్ట జయంతి గౌడ్ డిమాండ్ చేసారు.మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. కాని మహిళలని గౌరవించడం మన బాధ్యత ఈరోజుల్లో కూడా చూస్తూనే ఉన్నాం ఎక్కడ చూస్తే అక్కడ అత్యాచారాలు,హత్యలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచించి కొత్త కటినమైన చట్టాలు తీసుకురావాలన్నారు.చట్టాలు ఎలాగైతే బలంగా ఉంటాయో వాటికి బయపడి ఈ అఘాయిత్యాలు  ఆగిపోవడానికి ఒక అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మహిళల గురించి ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తీసేయాలన్నారు. తప్పు చేసిన వాళ్ళకి భయం అనేది మొదలవుతుంది తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాదు. తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు  కోరి ఈ నిర్ణయం తీసుకోవాలని మహిళలమందరం  కోరుకుంటున్నామన్నారు. మహిళలకు ఎప్పుడైతే రక్షణ కలుగుతుందో అది నిజమైన బంగారు తెలంగాణ నాంది పలుకుతున్దన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజల మేలుకోరి ఈ నిర్ణయం తక్షణమే తీసుకోవాలని మట్ట జయంతి గౌడ్ కోరారు .

Leave A Reply

Your email address will not be published.