నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయి అవార్డ్ రావడం గర్వకారణం.
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయి అవార్డ్ రావడం గర్వకారణమని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. తెలుగు సినిమా స్థాయి ప్రపంచం గుర్తించే విధంగా ఎదిగినందుకు ఆర్.ఆర్.ఆర్ సినిమా నిర్మాతలకు, దర్శకులకు, పాట రచయితకు, గాయకులకు నా హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. RRR సినిమాలో నాటు – నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం పై చిత్రం యూనిట్ కు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.