జిల్లా ప్రజానీకానికి క్షమాపణ చెప్పి సీఎం కేసీఆర్ ఖమ్మంలో అడుగుపెట్టాలి

- కాంగ్రెస్ మహిళా నేత రేణుకాచౌదరి డిమాండ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా ప్రజానీకానికి క్షమాపణ చెప్పి ఖమ్మంలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ మహిళా నేత రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను చూస్తే జాలి కలుగుతోంది.. టీఆర్ఎస్….బీఆర్ఎస్ అంట. కేసీఆర్ చివరకు జర్నలిస్టులను సైతం మోసం చేశారు. ఖమ్మం జర్నలిస్టులకు నాలుగు సార్లు స్వయంగా తండ్రి, కొడుకులు హామీ ఇచ్చి పట్టించుకోలేదు. ఛాలెంజ్ చేస్తున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ స్థానాలతో పాటు పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటాం. బీజేపీకి అడ్రస్సే లేదు. దేశంలో చరిత్రహీనులుగా మిగిలిపోయిన నేతలు కూడా నేడు కథలు చెబుతున్నారు. ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో రెండు సార్లు ఓడిపోయాం.. ఇది మా స్వయంకృతం.. అందుకు చెంపలేసుకుని ప్రజలలోకి వచ్చాం.’’ అని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.

 సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లా ప్రజానీకానికి క్షమాపణ చెప్పి ఖమ్మంలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ మహిళా నేత రేణుకాచౌదరి డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో రేణుకా చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ను చూస్తే జాలి కలుగుతోంది.. టీఆర్ఎస్….బీఆర్ఎస్ అంట. కేసీఆర్ చివరకు జర్నలిస్టులను సైతం మోసం చేశారు. ఖమ్మం జర్నలిస్టులకు నాలుగు సార్లు స్వయంగా తండ్రి, కొడుకులు హామీ ఇచ్చి పట్టించుకోలేదు. ఛాలెంజ్ చేస్తున్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ స్థానాలతో పాటు పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంటాం. బీజేపీకి అడ్రస్సే లేదు. దేశంలో చరిత్రహీనులుగా మిగిలిపోయిన నేతలు కూడా నేడు కథలు చెబుతున్నారు. ఈ దేశం కోసం అనేక త్యాగాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశంలో రెండు సార్లు ఓడిపోయాం.. ఇది మా స్వయంకృతం.. అందుకు చెంపలేసుకుని ప్రజలలోకి వచ్చాం.’’ అని రేణుకాచౌదరి వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.