డ్రగ్స్‌కు అలవాటు పడి విద్యార్థులు, యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: డ్రగ్స్‌కు అలవాటు పడి విద్యార్థులు, యువత తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. బుధవారం రాజకొండ పోలీస్‌ కమిషనరేట్‌ ఆధ్వర్యంలో మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కన్వెన్షన్‌ హాల్‌లో మాదక ద్రవ్యాల నిరోధంపై అవగాహన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రంలో మహిళల రక్షణకు, డ్రగ్స్‌ నిరోధానికి అనేక చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.పోలీసులు డ్రగ్స్‌ మహమ్మారిపై ఉక్కుపాదం మోపాలని తెలిపారు. బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటున్న తరుణంలో డ్రగ్స్‌ను పారదోలేందుకు విద్యార్థి, యువత ముందుకు రావాలన్నారు. కళాశాలల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల ర్యాగింగ్‌ తగ్గుముఖం పట్టిందన్నారు. అదేరకంగా డ్రగ్స్‌పై కూడా నిరంరత పర్యవేక్షణ ఉంటూ యువతకు డ్రగ్స్‌ నిరోధంపై అవగాహన కల్పించాలని సూచించారు.విద్యార్థులు తమకు ఎదురవుతున్న ఇబ్బందులను షీటీమ్‌ దృష్టికి తీసుకురావాలని కోరారు. రాచకొండ సీపీ డీఎస్‌ చౌహన్‌, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, నైనా జైస్వాల్‌, వంశీకృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఆయాచితం శ్రీధర్‌, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ దుర్గా దీప్‌లాల్‌ చౌహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.