తెలంగాణాలో టి ఆర్ ఎస్ పార్టి ఏర్పాటు

తెలంగాణ రక్షణ సమితి (TRS) పార్టీని దీపావళి పండుగ రోజున డిక్లేర్ చేస్తున్న తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి, తెలంగాణ మేధావుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ
తెలంగాణ ప్రజల ఆశయాలను, సిద్ధాంతాలను, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ, తెలంగాణ భవిష్యత్తును రక్షించే విధంగా మేధావులతో మేధోమధనం చేసి ఏర్పాటు చేస్తున్న పార్టీ తెలంగాణ రక్షణ సమితి (TRS). మన తెలంగాణ కోటి రతనాల వీణ, మన తెలంగాణ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన తెలంగాణ పోరాటాల గడ్డ, మన తెలంగాణ ఉద్యమకారుల, విద్యార్థుల, మేధావుల సిద్ధాంతాలతో రచించబడిన తెలంగాణ, అందుకే తెలంగాణ ప్రజల ఆశలకు ,ఆశయాలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటు చేస్తున్న పార్టీ తెలంగాణ రక్షణ సమితి. మన నీళ్లు, మన నిధులు ,మన నియామకాలు మనకు కావాలన్నా, ప్రత్యేక తెలంగాణ లో తెలంగాణ వాదులచే ఏర్పాటు చేసిన పార్టీ ఉండాలి. అందుకే అమరులైన తెలంగాణ విద్యార్థుల ఆశయాల కోసం, మేధావుల సిద్ధాంతాల కోసం, ప్రతి తెలంగాణ అక్క చెల్లి అవ్వ, అన్నా ,తమ్ముడు అందరూ హర్షించే విధంగా మన జెండా, ఎజెండా ఉంటుంది. , మన మేనిఫెస్టో ఉంటుంది, మన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు ఉంటాయి. తెలంగాణ ప్రజల సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న పార్టీ తెలంగాణ రక్షణ సమితి. ఆంధ్ర పెత్తందారీ వ్యవస్థను తిప్పి కొట్టి, తెలంగాణ రైతాంగానికి, నిరుద్యోగులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలితాలు అందే విధంగా ఉండే విధంగా మన మేనిఫెస్టో ఉంటుందని తెలియజేస్తున్నాను. పెత్తందారీ వ్యవస్థను తిప్పి కొట్టడానికి, ఆంధ్రుల పరిపాలనను వదిలి తెలంగాణ ప్రజలు తెలంగాణ వారి చేత పరిపాలించబడాలి అనే సిద్ధాంతంతో, ఆశయంతో లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న పార్టీ తెలంగాణ రక్షణ సమితి.

Leave A Reply

Your email address will not be published.