కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు 27 శాతం అవకాశం

- బీసీ రాజ్యాధికార సమితి - దాసు సురేశ్ ,కన్వీనర్ -

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ జనవరి మండల్ కమిషన్ సిఫార్సుల మేరకు దేశములో బీసీలకు విద్య ఉద్యోగ రంగాలలో కొనసాగుతున్న 27శాతం రిజర్వేషన్లను అనుసరించి తమ క్యాబినెట్ లో  బీసీలకు 27 శాతం మంత్రిత్వ శాఖలను కేటాయించిన బీజేపీ ప్రభుత్వం చట్టసభల్లో సైతం బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు  అందే విధంగా బిల్లు ఎందుకు రూపొందించడం లేదని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో ప్రశ్నించారు..భారత రాజ్యాంగంలో మనం రచించుకున్న “సమానత్వం” నేటికీ వాస్తవ రూపం దాల్చలేదని,  దేశ ప్రజలకు కూడు , గూడు , గుడ్డ ను అందించే బీసీలు నేటికీ అన్ని రంగాల్లో వెనకబడి ఉన్నారని దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేశారు . తాము నిర్వహించే అన్ని రంగాలలో ప్రావీణ్యతను ప్రదర్శించే బీసీలు ,రాజకీయ రంగంలో  రాణించకపోవడం వల్లనే మన దేశం ప్రపంచ దేశాలతో పోటీపడలేకపోతుందన్నారు.. అందుకై చట్ట సభల్లో 27 శాతం రిజర్వేషన్ లు బీసీలకు ఆవశ్యమన్నారు..అవకాశమిస్తే బీసీలు అన్ని రంగాల అద్భుతంగా రానిస్తారని అందుకు రాజకీయ రంగమేమీ మినహాయింపు కాదని స్పష్టం చేశారు..తమ రక్తాన్ని స్వేదంగా మార్చి పలు ఉత్పత్తి , సేవలతో దేశ సంపదను పెంచుతున్న బీసీలంతా ఒక్కటే కులమని, అది “శ్రమ ” కులమని వ్యక్తపరిచారు..బీసీలను అగ్రవర్ణ , రాజకీయ పార్టీలు అనేక కులాలుగా విభజించి తమ పబ్బం గడుపుకుంటున్నాయన్నారు. ఇది బీసీ లు గమనించాలన్నారు..ఎటువంటి ఉద్యమాలు , ఉద్రిక్తతలు ,నిరసనలు లేకపోయినా రాత్రికి రాత్రే 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను చట్టబద్దం చేసిన కేంద్ర ప్రభుత్వం దేశంలోని పార్లమెంటు , అన్నిరాష్ట్రాల్లోని అసెంబ్లీలలో కూడా బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేసేలా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో చట్టం తేవాలన్నారు . బీసీలను నోరులేని మూగజీవాలుగా ప్రభుత్వాలు పరిగణిస్తున్నాయన్నారు. సంపన్నులకు సంపదను దోచిపెడుతూ ,పేదవాడు దేశంలో బతికే పరిస్థితి లేకుండా చేశారన్నారు .. 75 ఏళ్లలో బీసీలను పాలకులు పట్టించుకోకపోవడం వల్లే దేశం తిరోగమనంలో  పయనిస్తుందన్నారు.అవకాశం ఇస్తే బీసీలు రాజకీయాల్లో అద్భుతంగా పాలించగలరు. గదిలో బందించి కొడితే పిల్లి కూడా పులిలా మారినట్లు ఈ దేశంలో బీసీలు తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని , పాలకులు మేల్కొనకపోతే అది వారికే నష్టదాయకమయ్యే విధంగా రాష్ట్రంలో , దేశంలో బీసీ ఓట్లపై అన్ని పార్టీలకు రాజకీయ అనివార్యతను సృష్టిస్తామన్నారు..

Leave A Reply

Your email address will not be published.