బీఆర్ఎస్ పై మంత్రి కేటీఆర్ అసంతృప్తి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జాతీయ రాజకీయాలను శాసించేలా బీఆర్ఎస్ పార్టీని విస్తరిస్తామని ఆ పార్టీ నేత కేసీఆర్ ప్రకటిస్తున్నారు. మరోవైపు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కీలకంగా మార్చేందుకు వ్యూహం పన్నుతున్నారు. ఇప్పటికే ఏపీలో కమిటీ వేసిన ఆయన మిగతా రాష్ట్రాల్లోనూ త్వరలో కేడర్ ను పెంచుకునేందుకు ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే  కేసీఆర్ కు సొంత మనిషే బీఆర్ఎస్ పై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో కారు పార్టీకి నెంబర్ గా ఉన్న కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. బీఆర్ఎస్ కు సంబంధించి ఏ ప్రత్యేక ప్రొగ్రాం అనౌన్స్  చేసినా వివిధ కారణాలతో ఆ కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. తాజాగా ఖమ్మంలో నిర్వహించే సభకూ డుమ్మా కొట్టనున్నారు.  దీంతో  బీఆర్ఎష్ పై కేటీఆర్ఎస్ అలక బూనాడా..అనే చర్చ సాగుతోంది.

ఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారినప్పటి నుంచి కేటీఆర్ పలు కార్యక్రమాల్లో కనిపించలేదు. ఢిల్లీలో పార్టీ కార్యాలయం ప్రారంభం మొదలుకొని మొన్నటి ఏపీ నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన తప్పించుకున్నారు. బీఆర్ఎస్ నిర్వహించే ముఖ్య కార్యక్రమాల రోజే ఆయన మిగతా ప్రొగ్రామ్స్ కు అపాయింట్మెంట్ ఇవ్వడం గమనార్హం. తాజాగా ఖమ్మం లో  నిర్వహించే బీఆర్ఎస్ తొలి సభకు కేటీఆర్ హాజరు కావడం లేదు. కేటీఆర్ ఈనెల 14న స్విట్జర్లాండ్ వెళ్లనున్నారు. వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. దీంతో ఆయన మరోసారి బీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై ఆయనకున్న అసంతృప్తే కారణమని వినిపిస్తోంది.
తెలంగాణ వాదంతో టీఆర్ఎస్ ను  ప్రజల్లోకి  తీసుకెళ్లిన కేటీఆర్ ఎక్కడా బీఆర్ఎస్ గురించి మాట్లాడడం లేదు.  ఒకప్పుడు తెలంగాణ కోసమే తమ పార్టీ అని నినాదాలు చేసి.. ఇప్పుడు బీఆర్ఎస్ ను ఆదరించండి.. అని ప్రజలను అయోమయానికి గురిచేయడం తనకు ఇష్టం లేదన్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేటీఆర్ ఎక్కడ సమావేశం నిర్వహించినా కేంద్రంపై రుసరుసలాడుతున్నాడే తప్ప.. బీఆర్ఎస్ గెలుస్తుందని ఒక్కమాట చెరప్పడం లేదు. మరోవైపు అంతకుముందు ప్రతీ ప్రాధాన్యం ఉన్న కార్యక్రమాల్లో తండ్రీ కొడుకులు వేదికపై కనిపించారు. కానీ బీఆర్ ఎస్ గా మారిన తరువాత కేసీఆర్ కేటీఆర్ ఒకే వేదికపై దాదాపు కనిపించడం లేదు.  ఇందుకు ఆయన బీఆర్ఎస్ పార్టీపై ఏమాత్రం ఇష్టం లేదనడానికి ఇదే నిదర్శనం అని అంటున్నారు.కేటీఆర్ మాత్రమే కాకుండా ఆ పార్టీలోని చాలా మంది నాయకులు బీఆర్ఎస్ గా మారడంపై అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ వాదం బాగా పాతుకుపోయింది. అందుకనే ఇతర పార్టీల్లోని నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. ఇలా మారడంపై ప్రజలు కూడా హర్షించారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ మారిన తరువాత ప్రజల్లోకి వెళితే ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉందని అనుకుంటున్నారు. కేసీఆర్ ఏ ప్రయోజనం కోసం బీఆర్ఎస్ గా మార్చాడో తెలియదు గానీ.. దీంతో తమనకు ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు. అందువల్లే చాలా మంది మంత్రులు సైతం బీఆర్ఎస్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనడం లేదు.
ఈనెల 18న నిర్వహించే ఖమ్మం సభ బాధ్యతలను ఆ పార్టీ నేత తుమ్మల నాగేశ్వర్ రావుకు అప్పగించారు. ఆ జిల్లాలో మంత్రి పువ్వాడ ఉన్నా.. ఆయనను కాదని తుమ్మలకు అప్పగించడంపై రకరకాలుగా అనుకుంటున్నారు. ఇప్పుడున్న కొంత మంది మంత్రులు బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారని దీంతో సభ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే తుమ్మల నాగేశ్వర్ రావుకు అప్పగించారు. రానున్న రోజుల్లో కూడా కొంత మంది మంత్రుల విషయంలో కేసీఆర్ ఇదే పాటించే అవకాశం లేకపోలేదని అనుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.