ఘనంగా ధనుర్మాస వైకుంఠ ఏకాదశ శ్రీవారి కల్యాణ మహోత్సవాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బాన్సువాడ ప్రతినిది: వైకుంఠ ఏకాదశి మకర సంక్రాంతి బోగి పండుగ  సందర్బంగా బాన్స్ వాడ పట్టణంలోని కోటగల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో శనివారం ధనుర్మాత్సవాల సందర్బంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ లక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పూజారి ప్రశాంత్ శర్మ,  వేదపండితుల మంత్రోశ్చరణలతో కన్నుల పండుగగా నిర్వహించారు.

మూడు రోజులుగా ఈ ఉత్సవాలను నిర్వహించారు. శుక్రవారం 108కలశాలతో  ప్రసాదవితరణ శనివారం శ్రీ గోదారంగనాథుల కల్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్స్ వాడ శాసనసభ్యులు సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడాడు భక్తజన సంద్రంతో  శ్రీ గోదాదేవి సామెత రంగనాథుల కళ్యాణ మహోత్సవంలోపాల్గొనడం శుభప్రదమని అన్నారు.భక్తి పరవశంలో స్వామివారి కల్యాణంలో పాల్గొనడం అనాదదాయకమన్నారు. ఆలయ ధర్మకర్త కోరిక మేరకు ఆలయ భోజనశాలకు 15లక్షలు ప్రభుత్వం ద్వారా కేటాయిస్తామని, ఫిబ్రవరి 26న తిమ్మాపూర్ వేంకటేశ్వర ఆలయములో స్వామి వారికీ బంగారు కిరీటం కోసం 2కిలోల బంగారంతో వజ్రకిరీటం తయారుకు బొంబేలో తయారు చేస్తున్నారని అన్నారు.

ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుచే శ్రీ వెంకటేశ్వర స్వామికి బంగారు కిరీటాన్ని అందజేస్తామన్నారు.భక్తులు అందించిన బంగారంతో ఈ కిరీటం తయారు చేయిస్తున్నామన్నారు.వచ్చే నెల శ్రీవారి కల్యాణ మహోత్సవానికి స్వచ్ఛదంగా ప్రజలు తరలి రావాలని కోరారు.వెంటేశ్వర ఆలయములో చిన్నారుల నృత్య ప్రదర్శనలకు భక్తులు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ముగ్ధులైనారు. ఈ కల్యాణ మహోత్సవం అనంతరం మహా అన్నధానకార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ ధర్మకర్తలు కాంట్రాక్ట్ నర్సింగరావు, పురప్రముఖులు, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.