నాగబాబు మనిషి పెరిగాడే కానీ బుద్ధి పెరగలేదు

- నాగబాబుపై మరోమారు రోజా సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జనసేన పార్టీ ముఖ్య నేత మెగా బ్రదర్ నాగ బాబు ఏపీ మంత్రి రోజా మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నాగబాబుపై మరోమారు రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు మనిషి పెరిగాడే కానీ బుద్ధి పెరగలేదని హాట్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ జోకర్ అని ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ అని తెలిపారు.ఇప్పటికైనా ఆయన ఫ్యాన్స్ పవన్ నిజ స్వరూపం తెలుసుకోవాలని రోజా సూచించారు. తన పార్టీ అన్ని చోట్లా పోటీ చేయలేదనే విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పాడన్నారు.ఈ పండుగకు చిరంజీవికి వాల్తేరు వీరయ్య రూపంలో బాలకృష్ణకు వీర సింహారెడ్డి రూపంలో డబ్బులు వస్తుంటే పవన్ కల్యాణ్ కు మాత్రం చంద్రబాబు నుంచి కలెక్షన్లు వచ్చాయని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన నాయకులకు మాత్రం పాపం ఏమీ అందలేదన్నారు.జగన్లా తాను పోటీ చేయలేనని గెలవలేనని పవన్ కల్యాణ్ ఒప్పుకున్నాడని రోజా హాట్ కామెంట్స్ చేశారు. 175 స్థానాల్లో అభ్యర్థులను పెట్టలేనని మొన్నటి మీటింగులో ఆయనే చెప్పుకున్నారని రోజా గుర్తు చేశారు. తమ మంత్రులను తిట్టడానికే పవన్ మీటింగు పెట్టాడన్నారు. చంద్రబాబును మోయడానికే పవన్ రాజకీయాల్లోకి వచ్చినట్టు ఉందని హాట్ కామెంట్స్ చేశారు.చిరంజీవి రాజకీయాల్లో లేరని.. ఆయనను తాను విమర్శించబోనని తెలిపారు. చిరంజీవిని హీరోగా తాను అభిమానిస్తానని చెప్పారు.ప్రతిపక్షాల చెత్త ఆలోచనలను భోగి మంటల్లో వేశానని తెలిపారు. ప్రజారంజకంగా పరిపాలిస్తున్న జగన్ పాలనలో ప్రజలకు ప్రతిపక్షాల అవసరమే లేదని రోజా తెలిపారు. అడగకుండానే అమ్మలాగా ప్రజలకు వైఎస్ జగన్ అన్నీ అందిస్తున్నారని కొనియాడారు.కల్చరల్ మినిస్టర్ గా పండుగ జరుపుకోవడం తనకు ఆనందంగా ఉందని వెల్లడించారు. సంక్షేమం అభివృద్ధిలో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా జగన్ తీర్చిదిద్దుతున్నారని స్పష్టం చేశారు. అందుకే ప్రతిపక్షాలు పిచ్చిపట్టి ఏం చేయాలో తెలియక జగన్ పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.తనను పవన్ కల్యాణ్ డైమండ్ రాణి అని వ్యాఖ్యానించడంపై రోజా కౌంటర్ ఇచ్చారు. పవన్ ను పొలిటికల్ జోకర్ అని ఎద్దేవా చేశారు. అలాగే ఇటీవల తనను మునిసిపాలిటీ చెత్త కుప్పతో పోల్చిన నాగబాబుపైన రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు వయసు పెరిగిందే బుద్ధి పెరగలేదన్నారు. ఈ నేపథ్యంలో రోజా వ్యాఖ్యలపై నాగబాబు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Leave A Reply

Your email address will not be published.