ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మియాపూర్‌లోని రూ.4వేల కోట్ల విలువైన భూములను.. తోట చంద్రశేఖర్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారని విమర్శించారు. సోమేష్‌కుమార్ కనుసన్నల్లోనే మియాపూర్ భూ స్కామ్ జరుగుతోందన్నారు. భూ స్కామ్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ పాత్ర ఉందన్నారు. సుఖేష్‌గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి కలెక్టర్.. తోట చంద్రశేఖర్ వ్యవహారంలో సుప్రీంను ఎందుకు ఆశ్రయించలేదని రఘునందన్‌రావు ప్రశ్నించారు. ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. కేసీఆర్‌కు గతంలో దొంగలుగా కనిపించిన ఆంధ్రవాళ్లు.. ఇప్పుడు బంధుమిత్రులుగా మారిపోయారని రఘునందన్‌రావు విమర్శించారు. సుఖేష్ గుప్తా వ్యవహారంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోట చంద్రశేఖర్ విషయంలో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించలేదు? అని ప్రశ్నించారు. అలాగే సర్వే నంబర్ 78లో జరుగుతోన్న అవకతవకలను సుప్రీంకోర్టు దృష్టతీసుకెళ్తామన్నారు. 8ఎకరాలకు ఒక న్యాయం, 40ఎకరాలకు ఒక న్యాయమా? అని ఆయన ప్రశ్నించారు.మియాపూర్ భూముల రాష్ట్ర ప్రభుత్వం తమ విధానాన్ని ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. సర్వే 78లో 40ఎకరాల భూములను తోట చంద్రశేఖర్‌కు చెందిన ఆదిత్య కస్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించారని పేర్కొన్నారు. బీహార్ నుంచి వచ్చిన అధికారులంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కవన్నారు. అందులో భాగంగానే బీహార్‌కు చెందిన అధికారిని డీజీపీగా నియమించారని అన్నారు. చెప్పు చేతల్లో పెట్టుకునేందుకే.. డైరెక్ట్‌గా రిక్రూట్ అయినవారిని కాకుండా.. కన్ఫర్డ్ ఐఏఎస్‌లను కలెక్టర్లుగా నియమిస్తున్నారని ఆరోపించారు

Leave A Reply

Your email address will not be published.