భూములు, నీళ్ల పేరిట కేసీఆర్ దోపిడి

.. ధరణి ఒక అక్రమాల పుట్ట - టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ వచ్చాక కేసీఆర్ నీళ్లు, భూమి పేరిట దోపిడీ చేసి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ధరణి ఒక అక్రమాల పుట్ట అని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.

కీసర లోని బలయేసు కేంద్రంలో ధరణి వెబ్సైట్ పైన బుధవారం నాడు ప్రారంభమైన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ధరణి పేరు తో అనేక విలువైన భూములను ప్రజాల నుంచి పేదల నుంచి దోచుకున్నారని వెబ్సైట్ లో పేర్లు లేకుండా చేసి,నిషేధిత జాబితాలో పెట్టి వాటిని తిరిగి యజమానులకు ఇవ్వడానికి కోట్ల రూపాయలు దోచుకున్నారని, ప్రభుత్వ భూములను, అసైన్డ్ భూములను తన వారికి అక్రమంగా కట్టబెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక పనికిరాని పనికిమాలిన ప్రాజెక్టు అని దీని పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని అన్నారు.

కాళేశ్వరం వల్ల తెలంగాణ కు అదనంగా ఒక్క ఎకరాకు నీరు రానున్న కేసీఆర్ కు మాత్రం వేల కోట్ల రూపాయలు అక్రమంగా వచ్చాయని అన్నారు. ధరణి లోపాలు, దోపిడీ, కేసీఆర్ అవినీతి, అక్రమాలపై శిక్షణ తీసుకున్న వారు ప్రజలకు వివరించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, టీపీసీసీ టీపీసీసీ ఉపాధ్యక్షులు హర్కర వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి నీలిమ, కిసాన్ కాంగ్రెస్, ఎస్సి సెల్, ఎస్టీ సెల్ చైర్మన్ లు అన్వేష్ రెడ్డి, ప్రీతమ్, జగన్ లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.