మియాపూర్ ప్రభుత్వ భూములను బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ భూములను రాజకీయ నాయకులుఅధికారులు కబ్జా చేస్తున్నారు.       కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలనిరాజ్యసభ సభ్యులుజాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేసారు. కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల పై నేడు బిసి భవన్ లో – రాష్ట్ర బీసీ సంక్షేమ  సంఘం కన్వీనర్ లాల్ కృష్ణ  అద్యక్షతన   బిసి సంఘాల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా కృష్ణయ్య మాట్లాడుతూ  రాష్ట్రమంతా భూకబ్జామయం గా మారింది. ప్రభుత్వమే – ప్రభుత్వ భూములను వేలం వేసే  రియల్ ఎస్టేట్ సంస్థలుగా తయారైంది. ప్రభుత్వ భూములు కబ్జాలకు గురైతే వేలం వేస్తే భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకుప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఒక అంగుళం భూమి కూడామిగలదు.          ప్రస్తుతం మియాపూర్ లో 60 ఎకరాల భూమిని తోట చంద్రశేఖర్ అనే ఒక కాంట్రాక్టర్ కు ఎలా ఇస్తారు.అలాగే షేక్పేట్ లోని 32 ఎకరాల ప్రభుత్వ భూమినిఒకట్రాక్టర్లకు ఎలా ధారాధత్తం చేశారు5 సంవత్సరాల క్రితం మియాపూర్ 300 ఎకరాల భూమి కేసు చాడీ చప్పుడు లేదు. ఇట్టి భూములను బీసీ గురుకుల పాఠశాలల నిర్మాణంకుబీసీ కాలేజీ హాస్టల్ నిర్మాణంకు ఇవ్వాలని బీసీ సంఘాలు ప్రభుత్వంను కోరగా వీటిపై హైకోర్టులో కేసులుయున్నవనికేసులు తీర్పు రాగానే బీసీ గురుకుల పాఠశాలలకు బీసీ కాలేజీ హాస్టల్లకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కానీ తీర్పు పెండింగ్ లో యుండగానే ప్రెవేట్ భూకబ్జాదారులకు దారదత్తం చేయడంలో యున్న రహస్యం ఏమిటని ప్రశ్నించారు.ఈ సమావేశం లో బిసి సేన జాతీయ కాన్వినర్ బర్కే కృష్ణ , ఎస్టి,ఎస్టి,బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర అద్యక్షులు జి. కృష్ణ యాదవ్, బిసి ప్రజా సమితి రాష్ట్ర అద్యక్షులు మధుసూదన్ ,బిసి సంఘర్షణ సమితి రాష్ట్ర అద్యక్షులు కూనూరు నర్సిమంహ గౌడ్, రాష్ట్ర బిసి ఐక్య వేదిక రాష్ట్ర అద్యక్షులు జి.అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.