న్యూజీలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ రాజీనామా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది అక్టోబర్‌లో దేశంలో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఆమె వెల్లడించారు. ఇవాళ జరిగిన పార్టీ వార్షిక కాకస్ సమావేశంలో ఆర్డెర్న్ ఈ సంచలన ప్రకటన చేశారు. న్యూజీలాండ్ లో తాజాగా వెలువడిన పోలింగ్ సర్వేల్లో జసిండా నేతృత్వంలోని లేబర్ పార్టీ.. ప్రతిపక్ష నేషనల్ కంటే కాస్త వెనుకబడి ఉంది. అయితే తన ముందస్తు రాజీనామాకు అది కారణం కాదని జసిండా వెల్లడించారు. అలాగే తన కుటుంబంతో సంతోషంగా గడపడం మినహా భవిష్యత్ ప్రణాళికలు కూడా ఏవీ లేవన్నారు.
దేశంలో చేపట్టాల్సిన సంస్కరణలకు ఇప్పుడు తగినంత సమయం లేదని, అందుకే ముందుగానే ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నట్లు జసిండా ప్రకటించారు. ప్రధానిగా ఆమె పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 7వరకూ ఉంది. అయితే ముందుగానే రాజీనామా చేశారు. కానీ ఈ ఏడాది ఎన్నికలు ముగిసేవరకూ ఆమె ఎంపీగా కొనసాగబోతున్నారు. రాజకీయ నాయకులంతా మనుషులేనని, తమ పరిధిలో చేయగలినంత కాలం పనిచేస్తామని జసిండా పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.