విద్యుత్‌ ఉద్యోగులు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలి

-  టీఎస్ టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సంస్థ అభివృద్ధి కోసం విద్యుత్‌ ఉద్యోగులు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాలని టీఎస్ టీఎస్‌ జెన్‌కో, ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్ రావు సూచించారు. తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ 2023 నూతన డైరీ, క్యాలెండర్ ను శనివారం ఆర్టీసీ కళా భవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఉద్యోగుల టెక్నీకల్ పనితీరు బాగుంది .ఫైనాన్సియల్ ఫెర్ఫామెన్స్ ఎందుకు మెరుగు పడటం లేద’ని పేర్కొన్నారు.మీటర్ సేల్స్ పెంచడం, వృధా ఖర్చులు తగ్గించుకోవడమే ముందు కనిపిస్తోందని వెల్లడించారు. కరెంట్ ఉత్పత్తి, పంపిణీ కోసం రూ. 37 వేల కోట్లు కేటాయించామని ఆయన పేర్కొన్నారు.ట్రాన్స్ కో, జెన్కో బాగున్నా. డిస్కమ్స్ పరిస్థితి బాగోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో సైబర్ క్రైమ్ పెరిగిందని అన్నారు. ఉద్యోగులు టెక్నాలజీ మీద,కమ్యూనికేషన్ స్కిల్స్ మీదు పట్టు పెంచుకోవాలన్నారు.బీహెచ్‌ఈఎల్‌కు రూ. 40 వేల కోట్ల కాంట్రాక్టు ఇవ్వడం వల్ల 5 నుంచి 6 వేల కోట్లు ఖర్చులు తగ్గాయని అన్నారు.అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.పీఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి నిర్ణయం తీసుకుంటామని,విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగ ఖాళీలను రాజ్యాంగ, న్యాయబద్ధంగా భర్తీ చేస్తామని అన్నారు.ఉద్యోగుల కోరికలు ఒక్కొక్కటిగా తీర్చే ప్రయత్నం చేస్తామని సీఎండీ వెల్లడించారు. జేఎండి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం డిస్కమ్స్ ను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించిందని,టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్తే ప్రైవైటైజేషన్ చేయాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్ రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరులు మాట్లాడారు.

Leave A Reply

Your email address will not be published.