బీఆర్ఎస్ నేతల అరాచకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం

- మల్లు రవి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీఆర్ఎస్ నేతల అరాచకాలు ప్రజల్లోకి తీసుకెళ్తామని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మల్లు రవి అన్నారు. బిజినేపల్లిలో జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి నేతలు, ప్రజలు వచ్చారు నిన్నటి సభకు జనాల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ధన్యవాదాలు అన్నారు. 2018 లో మార్కండేయ ప్రాజెక్టును 6 నెలల్లో పూర్తి చేస్తామని కేసీఆర్ కేటీఆర్ చెప్పారు కానీ 5 ఏళ్ళు అవుతున్న పట్టించుకోలేదు. దీనిపై నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సందర్శనకు వెళ్లిన నేతల గొంతు మీద కాలు వేసి తొక్కారు. రాష్ట్రం అంతా చూసింది ఈ ఘటనతో సభ్య సమాజం ఉలిక్కిపడినది దళిత గిరిజన బడుగు బలహీన వర్గాల గొంతుగా కాంగ్రెస్ నిలబడుతోంది ప్రజల మనప్రాణాలను రక్షించాల్సిన బీఆర్ఎస్.. నిందితులను ప్రోత్సహిస్తోంది. ఆ వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు మరి ఎందుకని ప్రశ్నించారు. ఈ సమావేశం కోసం ఫ్లెక్సీలు వేస్తే స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రాత్రికి రాత్రే వాటిని చించేశారు ఉక్కుపాదంతో దళిత, గిరిజనులను, పేదలను ఈ ప్రభుత్వం అణచివేస్తోంది ఇక జనార్దన్ రెడ్డికి అక్కడికి వెళ్లడం అపవిత్రం అని స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు.

ప్రభుత్వ ఆదేశాలతోనే అక్కడ ఈ అరాచకాలు దళితులు, గిరిజనుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ నేతల మీద పోలీసుల ప్రోద్బలంతో దొంగ కేసులు పెడుతున్నారు, దీనిపై పీసీసీ చీఫ్ రేవంత్ ఆధ్వర్యంలో డీజీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాం.. కానీ ఎలాంటి పురోగతి లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికి చర్యలు తీసుకోకపోతే 90 శాతం ఉన్న ఈ వర్గాలు ఓటు రూపంలో ఎలాగూ బుద్ది చెప్తారు డీజీపీ ఎస్పీ కానీ దీనిపై చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ చూస్తూ ఉరుకోదు. జైల్ భరో కార్యక్రమాన్ని చేపడతాము, కేంద్రం బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాయి, నిన్నటి సభతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ భరోసా ఇస్తోందని రుజువు అయింది అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయి. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం. రాష్ట్రంలో 75 కంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వస్తోంది మీరంతా సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి అన్నారు. వంశీ కృష్ణ, నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు దళితులకు కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారిపైనే దాడులు చేస్తున్నారు రాష్ట్రంలో నయా నిజాం నవాబు పాలన నడుస్తోంది. నియంత పాలన అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట 108 అబద్ధాలపై త్వరలో పుస్తకం విడుదల చేస్తున్నాం రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నరు ఎమ్మెల్యేలు ఎలా చెప్తే అలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్నారు. మనం కోరుకున్న తెలంగాణ రావాలి అంటే అన్ని వర్గాలు మేల్కోవాలి ల్యాండ్, శాండ్, వైన్, మైన్ ఈ నాలుగు బిజినెస్ లు చేసి అధికారపార్టీ నేతలు కోట్లు కొల్లగొడుతున్నారన్నారు.

– రాములు నాయక్, మాజీ ఎమ్మెల్సీ…

నిన్నటి సభ చూసి బేకుఫ్ రాష్ట్ర సమితికి ఏం చేయాలో అర్థం కావట్లేదు నిన్న నారాయణ్ ఖేడ్ లో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. ఓబీసీలు, మైనార్టీలను మోసం చేసేందుకు కేసీఆర్ కుట్రలు రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఇలాంటి సభలు పెట్టి, బీఆర్ఎస్ నేతల అరాచకాలు ప్రజల్లోకి తీసుకెళ్తాం అన్నారు.

Leave A Reply

Your email address will not be published.