ఎన్నికల సమయంలోనే పొత్తులపై స్పష్టత

-    కేసీఆర్‌ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం -  జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: పొత్తులపై మరోసారి జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలోనే పొత్తులపై స్పష్టత వస్తుందని జనసేనాని తేల్చిచెప్పారు. కొండగట్టు లో వారాహి వాహనానికి పవన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఓట్లు చీలకూడదన్నదే నా అభిప్రాయం. మాతో అందరూ కలిసిరావాలి. ప్రతిపక్షాలను అణిచివేయడానికే జీవో నెం.1 తీసుకొచ్చారు. వైసీపీ కి విశ్వాసం సన్నగిల్లుతోంది. 175 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు. నారా లోకేశ్‌, నా పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తే వారికి నమ్మకం లేనట్లే కదా?, దావోస్ పర్యటనలో ఏపీ గురించి అందరికీ తెలిసిందే కదా..?, బీజేపీతో పొత్తు కొనసాగుతోంది. బీజేపీ తో ఇప్పుడు కలిసే ఉన్నాం. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా ముందుకెళ్తాం. లేదంటే ఒంటరిగా ఎన్నికలకు వెళ్తాం. కొత్త పొత్తులు కుదిరితే కొత్తగా వెళ్తాం. వారం రోజుల్లో ఎన్నికలు ఉంటే పొత్తులపై మాట్లాడొచ్చు. కానీ ఇప్పుడు ఎన్నికలు లేవు కదా?.’’ అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

BRSపై ఏమన్నారంటే…

తెలంగాణ అభివృద్ధి కోసం కూడా జనసేన పనిచేస్తుంది. తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో పనిచేస్తా. కేసీఆర్‌ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణ నా నేల తల్లి. తల్లికి నా పాదాభివందనం. తెలంగాణ నాకు పునర్జన్మ ఇచ్చింది. నా తెలంగాణ కోసం పని చేస్తా. తెలంగాణ మార్పు కోసం జనసేన పని చేస్తుంది. తుది శ్వాస వరకు తెలంగాణ, తెలుగు రాష్ట్రాల కోసం పని చేస్తా.’’ అని జనసేనాని చెప్పుకొచ్చారు.

Leave A Reply

Your email address will not be published.