ఇంటి టెర్రస్‌ నుంచి ఈల వేయడం లైంగిక వేధింపు కాదు

- హైకోర్టు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇంటి టెర్రస్‌ నుంచి ఈల వేయడం మహిళ పట్ల లైంగిక వేధింపు కాదని హైకోర్టు తెలిపింది. దంపతులు నమోదు చేసిన కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేయకుండా ముందస్తు బెయిల్‌ ఇచ్చింది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నివాసం ఉండే పొరుగింటికి చెందిన లక్ష్మణ్, యోగేష్, సవితా పాండవ్‌పై ఒక మహిళ, ఆమె భర్త కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యోగేష్‌ అనే వ్యక్తి తన హుందాతనాన్ని కించపరిచేలా ప్రవర్తించినట్లు ఆ మహిళ ఆరోపించింది. 2021 నంబర్‌ 28న తనను మొబైల్‌లో వీడియో రికార్డు చేశాడని, దీనిని తన భర్త గమనించినట్లు పేర్కొంది. దీని గురించి ఇంటి యజమానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. తన, కుటుంబ సభ్యుల వీడియో క్లిప్‌లను పొరుగువారికి చూపించి తమ పరువు తీసేలా ప్రవర్తించడంతోపాటు కులాన్ని కించపరిచేలా మాట్లాడినట్లు ఆరోపించింది. అయితే దీని గురించి తాను పట్టించుకోలేదని ఆమె పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.