తెలంగాణపై టిడిపి కన్ను

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇన్ యాక్టివ్ గా మారిపోయింది. అధినేత చంద్రబాబు ఏపీకే పరిమితం కావడంతో తెలంగాణ టీడీపీ నేతలు తలోదారి వెతుక్కున్నారు. రాబోయే ఎన్నికల నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లో సత్తా చాటాలని భావిస్తున్న టీడీపీ నేతలకు చంద్రబాబు నిర్ణయం కీలకంగా మారబోతోంది. చంద్రబాబు మునుగోడు నుంచి రాజకీయ ప్రయోగం చేయబోతున్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. మునుగోడులో పోటీ చేసే విషయంలో పార్టీ తెలగాణ అధ్యక్షుడు బక్కని నర్సింలు శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో ముఖ్యనేతలతో చర్చించడం ఆసక్తిగా మారింది. ఈ ఎన్నికల్లో పోటీ చేయడానికి తాము రెడీగా ఉన్నట్లు పార్టీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. పోటీ చేస్తే పార్టీకి కలగబోయే ప్రయోజనాలను బాబుకు వివరించినట్లు తెలుస్తోంది. అధినేత ఆజ్ఞాపిస్తే బరిలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పార్టీ మునుగోడు ఇన్ చార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ కోరినట్లు తెలిసింది.

తెలంగాణ రాష్ట్రంపై చంద్రబాబు ఆసక్తి:

మునుగోడులో బీసీ వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. జక్కలి ఐలయ్య బీసీ నేతగా స్థానికంగా మంచి పేరు ఉంది. ఇక టీడీపీ విషయానికి వస్తే ఆ పార్టీకి బీసీలలో అభిమానం ఇంకా ఉందనే టాక్ ఉంది. అందువల్ల మునుగోడులో పోటీ చేయాలని, దీని ద్వారా వచ్చే ఎన్నికల నాటికి లోటుపాట్లను సరిచేసుకునే ఛాన్స్ కూడా దొరుకుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారట. ఇటీవల చంద్రబాబు సైతం తెలంగాణపై ఆసక్తి చూపడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఏపీలో సీరియస్ పాలిటిక్స్ చేస్తూనే చంద్రబాబు ఇటీవల చేపట్టిన భద్రాచలం పర్యటన ఇంట్రెస్టింగ్ గా మారింది. త్వరలోనే ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ పార్టీ నేతలకు ఈ సూచించారు. చంద్రబాబు నేపథ్యంలో మునుగోడు అవకాశాన్ని పార్టీ ఉపయోగించుకోవడంపై రాష్ట్ర నేతలు అధినేత దృష్టికి తీసుకువెళ్లగా అందుకు బాబు కూడా సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో పార్టీ ప్రస్తుతం అంపశయ్యపై ఉంది. పార్టీకి మళ్లీ జవజీవాలు పోయాలనే ఉద్దేశంతో తెలంగాణ నేతలు ఉన్నా అధిష్టానం ఆ స్థాయిలో ఆసక్తి చూపకపోడమే పార్టీ దుస్థితికి కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో చక్రం తిప్పిన టీడీపీ తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన ఉప ఎన్నికలంటికి దూరంగా ఉంది. కొన్ని చోట్ల బరిలో ఉంటామని పార్టీ నాయకత్వం చెప్పినప్పటికీ పోటీ చేయడానికి నేతలు సాహసించలేదు. మరికొన్ని చోట్ల ఆసక్తి చూపిన అధిష్టానం వెనుకంజ వేసింది. దీంతో ఈసారి మునుగోడు బరిలో నిలవాలని నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. మునుగోడులో 12సార్లు ఎన్నికలు జరగ్గా టీడీపీ కేవలం మూడు సార్లు పోటీ చేసి ఓటమి చవిచూసింది. లెఫ్ట్ పార్టీలతో పొత్తు కారణంగా ఎనిమిది సార్లు పోటీకి దూరంగా ఉంది. అయితే తెలంగాణలో పార్టీకి మళ్లీ ఊపిరి భావిస్తున్న చంద్రబాబు మునుగోడు ఊదాలని ద్వారా తెలంగాణలో రాజకీయ ప్రయోగం చేస్తే ఇది ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.

 

 

Leave A Reply

Your email address will not be published.