గవర్నర్ తమిళ సై బీజేపీ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు

- రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జనవరి 26th రాజ్యాంగం అమలు కాబడ్డ రోజు ఆ రోజే రాజ్యాంగాన్ని అవమానం పరచే విధంగా తెలంగాణా ప్రభుత్వం పై ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలన పై తెలంగాణ గవర్నర్ తమిళ సై గారు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా ఉన్నాయని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి అన్నారు. తమిళ సై వాఖ్యలను ఖండిస్తూ చైర్మన్ పత్రిక ప్రకటనను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గవర్నర్ స్థాయి మరచి మాట్లాడుతూన్నారని, ప్రజా జీవితంలో తిరస్కరణకు గురైన తమిళ సై గారు 40 సం.రాలుగా ప్రజా జీవితంలో ఉంటూ ప్రజల అభిమానాన్ని చూరగొని, 4కోట్ల ప్రజల ప్రతినిధిగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏర్పడ్డ ముఖ్యమంత్రి గారిని విమర్శించడం ఆమె ఆజ్ఞనానికి నిదర్శనమని విమర్శించారు.ప్రోటోకల్ పాటిస్తలేరు అని చెప్పిన తమిళ సై మరి ఏ ప్రోటోకాల్ ఉందని తెలంగాణ గురించి పాండిచేరి లో విషం గక్కరని, ఆమెకు కావాల్సింది దేశ ప్రధాని మోడీ కి నమ్మిన బంటుగా ఉంటూ, బిజెపి కి అనుకూలంగా వ్యహరిస్తూ తెలంగాణ లో ఆ పార్టీ బలోపేతం కు తాను ఒక్క బీజేపీ జాతీయ నాయకురాలిగా పాత్ర పోషిస్తుందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాజ్ భవన్ ను బిజిపి పార్టీ అడ్దగా మార్చివేసిందని, అసలు రాజ్ భవన్ కి ప్రగతి భవన్ కి అంతరము పెంచారా? పెంచుకుందా? అని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. గతంలో గవర్నర్ గా ఉన్న నరసింహన్ ఎలా ఉండే ఇపుడు ఉన్న గవర్నర్స్ వారి స్థాయి, రాజ్యాంగ హోదా మరచి ఒక రాజకీయ నాయకురాలిగా మాట్లాడం చూసి ప్రజలు అసహించుకుంటున్నారని, మీకు బిఆర్ఎస్ పార్టీ ని మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై మాట్లాడాలంటే ముందు రాజ్యాంగబద్ధ పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి రాజకీయంగా మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.తెలంగాణ లో రాజ్యాంగ వ్యతిరేక పాలన జరిగితే మరి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ వచ్చేదా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతు బంధు లాంటి అనేక పథకాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్, రివార్డ్స్ ఇవ్వడం మర్చిపోయారా.. పెరిగిన తెలంగాణ జి.ఎస్.డి.పి., విదేశాల నుండి వస్తున్నా వేల కోట్ల పెట్టుబడులు వందల కంపినీలు అనేక మంది యువత కు ఉద్యోగ ఉపాధి అవకాశలు పెరుగుదల కనిపిస్తలేదా? ప్రజారంజక పాలన ఇక్కడ కొనసాగుతుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చట్టాలు చేసి మీకు పంపిస్తే మీరు ఆ బిల్లులను దగ్గర పెట్టుకున్నది వాస్తవం కాదా? బిజిపి పార్టీ బి.ఆర్.ఎస్ పార్టీకి వ్యతిరేకం అయ్యాకనే మీరు ప్రభుత్వనికి వ్యతిరేకం అయ్యారు కదా అని ప్రశ్నిస్తూ మీకు వెంటనే బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య మంత్రి చెయ్యాలనే కూతుహలం బాగా ఉందని. మీ ఆలోచన మీ అడుగులు బిజిపి కోసమే అందుకే మీ లాంటి గవర్నర్స్ చూసాక ప్రజలు ఈ గవర్నర్ వ్యవస్థను రద్దు పరచాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.ఇకనైనా బిజిపి పార్టీ నాయకురాలిగా కాకుండా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నామనే సోయితో మాట్లాడాలని డిమాండు చేశారు.

 

Leave A Reply

Your email address will not be published.