దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులపై ఏడిఆర్ సంచలన నివేదిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ సంచలన నివేదిక వెలువరించింది. మహారాష్ట్ర మంత్రుల్లో 20 మంది మంత్రులకు గాను 13 మందిపైజార్ఖండ్‌లోని 11 మంది మంత్రులకు గాను ఏడుగురిపైతెలంగాణలో 17 మంది మంత్రులకు గాను 10 మందిపై సీరియస్ క్రిమినల్ కేసులున్నాయని నివేదిక వెల్లడించింది.558 మంది ఎమ్మెల్యేల్లో 486 మంది కోటీశ్వరులని నివేదిక తెలిపింది. 239 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులున్నాయని స్వయంగా వారే వెల్లడించారు. తెలంగాణలోని 13 మంది మంత్రులుతమిళనాడులోని33 మంది మంత్రుల్లో 28 మందిబీహార్‌లోని 21 మంది మంత్రులుపంజాబ్‌లోని 11 మంది మంత్రులు తమపై క్రిమినల్ కేసులున్నాయని స్వయంగా తమ అఫిడవిట్‌లలో వెల్లడించారు.28 రాష్ట్రాలురెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 567 మంత్రులకు గాను 558 మంత్రుల అఫిడవిట్‌లను పరిశీలించి ఈ నివేదిక తయారు చేశారు.

Leave A Reply

Your email address will not be published.