నెల్లూరు రూరల్ ఇంచార్జి ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఏపీలో నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు సృష్టించిన కల్లోలంతో ఆ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. తమ ఫోన్లను తమ ప్రభుత్వమే ట్యాప్ చేయిస్తోందని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని తేల్చాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.అలాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను వైసీపీలో కొనసాగబోనని తేల్చిచెప్పడంతో ఆయన స్థానంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇంచార్జిగా నెల్లూరు ఎంపీగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. సాయంత్రంలోగా దీనిపై ప్రకటన రావచ్చని చెబుతున్నారు.ఇప్పటికే నెల్లూరు జిల్లా పరిణామాలపై సీఎం జగన్.. ఆ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులతో చర్చలు జరిపారు. నెల్లూరు వ్యవహారాన్ని ఇక సాగదీయడం మంచిది కాదని.. పుల్ స్టాప్ పెట్టాలని జగన్ నిర్ణయించినట్టు టాక్.ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జీగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సోదరుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేర్లు తెరమీదకొచ్చాయి. అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపే సీఎం జగన్ మొగ్గు చూపుతున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి సాయంత్రం అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ తో మరోసాని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నెల్లూరు జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆదాల ప్రభాకర్ రెడ్డిని నెల్లూరు రూరల్ ఇంచార్జిగా నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ను కలుస్తున్నామని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వెల్లడించడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏ బాధ్యత అప్పగించినా చేయటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.మరోవైపు పార్టీకి డ్యామేజ్ చేసే స్థాయి కోటంరెడ్డికి లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. జగన్ దయతోనే కోటంరెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడన్నారు. జగన్ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళే గెలుస్తారన్నారని తేల్చిచెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని శ్రీధర్ రెడ్డి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని సవాల్ విసిరారు. తాను చేసిన ఛాలెంజ్కు కోటంరెడ్డి నుంచి సమాధానం లేదని గుర్తు చేశారు. ఆయన స్నేహితుడే ఫోన్ సంభాషణలు రికార్డ్ చేశాడని కోటంరెడ్డికి కూడా తెలుసన్నారు.

Leave A Reply

Your email address will not be published.