కేరళ తీరంలో1200 కోట్ల విలువైన హెరాయిన్ ను పట్టేసిన ఎన్సీ

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్‌లోకి తరలిస్తున్న భారీ హెరాయిన్ షిప్‌మెంట్‌ను అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను భారత్శ్రీలంకలో అమ్మడానికి ఒక ఇరానియన్ బోటులో తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. దీన్నుంచి ఒక శ్రీలంక బోటులోకి ఈ డ్రగ్స్‌ను తరలించాల్సి ఉందనిసదరు బోటును ట్రేస్ చేయడం కష్టంగా మారి ఉండేదని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు తెలిపారు.భారత నేవీతో కలిసి ఆపరేషన్ చేపట్టిన ఎన్సీబీ అధికారులు ఈ డ్రగ్స్ షిప్‌మెంట్‌ను పట్టుకున్నారు. ఈ మొత్తాన్ని కేరళలోని కోచి తీసుకొచ్చారు. అలాగే ఆరుగురు ఇరానియన్ దేశస్థులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ డ్రగ్స్ ముందుగా పాకిస్తాన్ వెళ్లాయనిఅక్కడ ఇరానియన్ బోటులో ఎక్కించి భారత్ తీసుకొచ్చారని అధికారులు తెలిపారు. ఈ డ్రగ్స్ ప్యాకెట్లపై ఉన్న గుర్తులుప్యాకింగ్ విధానం ఆఫ్ఘానిస్తాన్పాకిస్తాన్‌లలోనే జరుగుతుందని వాళ్లు తెలిపారు. ఈ డ్రగ్స్ విలువ మార్కెట్‌లో రూ.1200 కోట్లు ఉంటుందని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.