అద్భుతం.. ఆశ్చర్యం.. అసెంబ్లీలో కేసీఆర్ సర్కార్ ను పొగిడిన గవర్నర్

-   గవర్నర్ కేసీఆర్ సర్కార్ మధ్యన సంధి కుదిరినట్లేనా!

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  తెలంగాణ గవర్నర్ తమిళిసైకి.. కేసీఆర్ సర్కార్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలున్నాయి. ఇద్దరూ ఉప్పునిప్పులా వాదప్రతివాదాలతో రెచ్చిపోయారు. ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ను బజారుకీడ్చింది గవర్నర్ తమిళిసై. ఇక గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు దారుణంగా నోరుపారేసుకొని రెచ్చిపోయారు. తెలంగాణ బడ్జెట్ ఇష్యూలో ఇరువర్గాలు తగ్గకపోవడంతో హైకోర్టుకు ఎక్కింది వ్యవహారం. ఆ తర్వాత రాజీ కుదిరి తాజాగా ఈరోజు గవర్నర్ తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించారు. ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడారు.ప్రభుత్వం గవర్నర్ మధ్య ఇటీవల జరిగిన విభేదాల నేపథ్యంలో అసెంబ్లీలో తమిళిసై ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. అయితే కాళోజీ కవితతో  ప్రసంగం ప్రారంభించిన తమిళిసై.. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్. దీంతో సీఎం ప్రజాప్రతినిధుల కృషి ఎంతో ఉంది. రాష్ట్రంలోని ప్రతి ప్రాంతంలో మార్పు కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది అని కొనియాడారు.దేశానికి అన్నం పెట్టే స్థాయికి చేరి తెలంగాణ ఆదర్శంగా మారిందని రాష్ట్ర గవర్నర్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రజా కవి కాళోజీ వాక్కులతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘పుట్టుక నాది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని కాళోజీ అన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ చేరింది. రాష్ట్ర పెట్టుబడుల స్వర్గధామంగా విలసిల్లుతోంది.  సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది.కాళేశ్వరాన్ని రికార్డు స్థాయిలో నిర్మించాం. రైతుబంధు పథకం ప్రపంచవ్యాప్త ప్రశంసలు పొందింది. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టుకున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో కొత్త సచివాలయం నిర్మాణం జరుగుతోంది. దేశంలోనే అత్యధికంగా 9.8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వైద్య కళాశాలలను 3 నుంచి 17కు పెంచాం. ఈ ఏడాది నుంచి మరో 9 వైద్యకళాశాలలు ఏర్పాటు చేశాం. పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమంతో జీవన ప్రమాణాలు పెరిగాయి.కేసీఆర్ సర్కార్ రాసిచ్చిందే గవర్నర్ చదివారు. సొంత కవిత్వాన్ని గవర్నర్ జోడించలేదు. కేసీఆర్ ప్రభుత్వంపై పల్లెత్తు వ్యతిరేక మాటలు అనలేదు. దీంతో గవర్నర్ కేసీఆర్ సర్కార్ మధ్యన సంధి కుదిరిందనే చెప్పాలి.

Leave A Reply

Your email address will not be published.