మహాశివరాత్రి బ్రహ్మోత్సవ రోజుల్లో ఆలయ దర్శన విధానాలో మార్పులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: శ్రీశైల మహాక్షేత్రంలో జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ రోజుల్లో ఆలయ దర్శన విధానాలో పలు మార్పులు చేసినట్లు ఈవో లవన్న వెల్లడించారు. ఈ నెల 11వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా.. 15 వరకు జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు నిర్ణీత సమయాల్లో మాత్రమే స్పర్శ దర్శనాలు కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే మధ్యాహ్నం సమయంలో జరుగుతున్న ఉచిత దర్శనాలు సైతం బ్రహ్మోత్సవాల ముందు రోజు వరకు మాత్రమే అనుమతించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా శివదీక్షా స్వాములకు చంద్రావతి కల్యాణ మండపంలో, శివదీక్షా శిబిరాల వద్ద నిత్యాన్నదానంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు.మండల దీక్షలు చేసుకుని స్వామిఅమ్మవార్ల దర్శనాలు పూర్తయిన తరువాత జ్యోతిర్ముడి సమర్పణ కోసం శివదీక్షా శిబిరాల వద్ద అర్చక పండితులచే శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి బ్రహోత్సవాలకు వచ్చే శివస్వాములతోపాటు యాత్రికులు కూడా దర్శన సమయాలను పాటిస్తూ క్యూలైన్ల వద్ద ఆలయ సిబ్బందితో సహకరించాలని ఈవో లవన్న, ధర్మకర్తల మండలి చైర్మెన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.