విజయశాంతికి సీటు ఎండమావేనా?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విజయశాంతి.. ఒకప్పుడు ఉద్యమపార్టీలో టీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత నంబర్ 2 పొజిషన్. కానీ ఇప్పుడు బీజేపీలో ఒక సాధారణ నేత. స్టార్ క్యాంపెయినర్ అన్న పేరే కానీ ఆమెకు వేదికలపై.. సభలు సమావేశాల్లో అంత ప్రాధాన్యం లేదని టాక్ ఉంది.. ఇక కాంగ్రెస్ లోనూ ఇదే కథ అనుభవించి బీజేపీలో చేరిన రాములమ్మకు ఇక్కడ కూడా గుర్తింపు గౌరవం లేదని ఆమె అభిమానులు అంటున్నారు.. బీజేపీ అధిష్టానం ఈమెను పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఆమెలో ఉందని ఒక ప్రచారం సాగుతోంది.టీఆర్ఎస్ లో ఉండగా రాములమ్మ మెదక్ ఎంపీగా గెలిచారు. అనంతరం మెదక్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టీఆర్ఎస్ ను వీడాకా ఆమె గెలవలేకపోయింది. గెలిపించే పార్టీ లేకుండా పోయింది. కాంగ్రెస్ లో చేరి మెదక్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఇప్పుడు బీజేపీలో ఆ సీటు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే విజయశాంతి పరపతి మెదక్ లో లేదు. ఆమె స్థానికురాలు కాదు. సో ఓట్లు పడే ఛాన్స్ లేదు. అందుకే విజయశాంతికి సీటు ఇచ్చినా వృథా అని.. ఆమెను నామినేటెడ్ పదవిలోకి పంపితే బెటర్ అని బీజేపీ ఆలోచిస్తోంది.తాజాగా విజయశాంతి కూడా అదే మాటన్నారు.  తెలంగాణ రాష్ట్రాన్ని ఎలాగైనా సాధించి రాష్ట్ర ప్రజల కళ్లలో ఆనందాన్ని చూడాలనే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు బీజేపీ నేత విజయశాంతి తెలిపారు. అయితే తెలంగాణ ఏర్పాటుతో కేసీఆర్ ఫ్యామిలీకే లాభం చేకూరిందని మండిపడ్డారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడ పోటీచేసేది బీజేపీ అధిష్టానం డిసైడ్ చేస్తుందని వెల్లడించారు.దీంతో విజయశాంతికి అంటూ ఒక సీటు లేదని అర్థమైంది. ఆమెనే ఈ నిజాన్ని అంగీకరించారు. టీఆర్ఎస్ లో వెలుగువెలిగిన రాములమ్మకు అటు కాంగ్రెస్ లో ఉన్నా.. ఇటు బీజేపీలో ఉన్న గెలుపు కష్టమని తేలిపోయింది. కనీసం బీజేపీలో ఆమెకు పోటీచేసేందుకు సీటు కూడా లేకపోవడమే చర్చనీయాంశమవుతోంది. ఆమె మాటలను బట్టి అదే నిజం అనిపిస్తోంది.

Leave A Reply

Your email address will not be published.