ఛ‌త్ర‌ప‌తి శివాజీ సొంతూరు శివ‌నేరి నుంచి బీఆర్ఎస్ ఎన్నిక‌ల యాత్ర‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మ‌రాఠా పోరాట యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ సొంతూరు శివ‌నేరి నుంచి బీఆర్ఎస్ ఎన్నిక‌ల యాత్ర‌ను పది రోజుల్లో ప్రారంభిస్తుంద‌ని కేసీఆర్ వెల్ల‌డించారు. ఈ దేశంలో కిసాన్ స‌ర్కార్ రావాల‌ని ప్ర‌తిజ్ఞ చేసి, యాత్ర‌ను ప్రారంభిస్తామ‌న్నారు.రాఠా పోరాట యోధుడు ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ సొంతూరు శివ‌నేరి నుంచి భార‌త్ రాష్ట్ర స‌మితి ఎన్నిక‌ల యాత్ర‌ను పది రోజుల్లో ప్రారంభిస్తుంద‌ని ఆ పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ వెల్ల‌డించారు. ఈ దేశంలో కిసాన్ స‌ర్కార్ రావాల‌ని శివాజీ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌తిజ్ఞ చేసి, యాత్ర‌ను ప్రారంభిస్తామ‌న్నారు. నాందేడ్‌ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న గురుగోవింద్‌ సింగ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బ‌హిరంగ స‌భ‌లో కేసీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు.మ‌హారాష్ట్ర‌లోని 288 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒకేసారి యాత్ర ప్రారంభం అవుతుంద‌న్నారు కేసీఆర్. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒకేసారి బీఆర్ఎస్ వాహ‌నాలు వ‌స్తాయ‌న్నారు. మ‌హారాష్ట్ర‌లో ఊరూరా బీఆర్ఎస్ కిసాన్ క‌మిటీలు ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. తాను కూడా ఉత్త‌ర మ‌హారాష్ట్ర‌, ప‌శ్చిమ మ‌హారాష్ట్ర‌, విద‌ర్భ ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని కేసీఆర్ చెప్పారు. రాబోయే జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌లతో పాటు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. తెలంగాణ‌లో అమ‌ల‌య్యే ప్ర‌తీ ప‌థ‌కం మ‌హారాష్ట్ర‌లో అమ‌ల‌వుతుంద‌ని కేసీఆర్ హామీ ఇచ్చారు. త‌న శ‌క్తి ఉన్నంత వ‌ర‌కు ఈ దేశం బాగు కోసం పోరాడుతాన‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కేసీఆర్ త‌న ప్ర‌సంగం ముగించే ముందు.. జై మ‌హారాష్ట్ర‌.. జై భార‌త్.. జై హింద్ అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.