టర్కీలో భారీ భూకంపం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  టర్కీలో భారీ భూకంపం సంభవించింది. టర్కీలోని నూర్ద్గికి తూర్పున 23 కిలోమీటర్ల దూరంలో భూకంపం రాగా.. అనేక భవనాలు కూలిపోయాయి. పేక మేడల్లో భవనాలు పడిపోతుంటే ప్రజలు అలాగే చూస్తుండిపోయారు. భవనాల్లో ఉన్నవారిలో పలువురు చనిపోగా.. శిథిలాల కింద ఇరుక్కుపోయిన కొందరిని పోలీసులు వెలికి తీస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు ప్రమాదంలో దాదాపు 10మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. వీరిలో ఉస్మానియాలో ఐదుగురు, సాన్లియూర్ఫాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదు అయింది. దక్షిణ టర్కీలో ఈ భూకంపం సంభవించింది. ఇక్కడ చాలా అపార్ట్‌మెంట్లు కూలిపోయాయి. ముఖ్యంగా 14 నుంచి 17 అంతస్తులు ఉన్న భవనాలను ఒక్కసారిగా పడిపోయాయి. అయితే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు సూచిస్తున్నారు. భూకంపం తర్వాత టర్కీ ప్రభుత్వం అంతర్జాతీయ సహాయం కోసం విజ్ఞప్తి చేసింది. టర్కీ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4:17 గంటలకు 17.9 కి.మీ లోతులో భూకంపం సంభవించింది. అదే సమయంలో, దక్షిణ టర్కీలోని గాజియాంటెప్ సమీపంలో సోమవారం 7.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వీస్ తెలిపింది.

Leave A Reply

Your email address will not be published.