తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు
- రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు - మూలధన వ్యయం రూ.35,525 కోట్లు - బడ్జెట్లో ఊసేలేని ఎన్నికల హామీల పథకా
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అసెంబ్లీలో ఆర్దిక శాఖ మంత్రి హరీష్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
- బడ్జెట్లో..దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించారు.
- పేదలకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.3లక్షల సాయం
- ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు
- కొత్తగా మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు
- ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు
- బడ్జెట్లో ఊసేలేని నిరుద్యోగుల భృతి హామీ
- ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్ఎస్ విధానం
- ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు
- ఈ ఏడాది 60 జూనియర్, సీనియర్, జిల్లా జడ్జిల కోర్టులు ఏర్పాటు
- ఏప్రిల్ నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
- ఏప్రిల్ నుంచి సెర్ప్ ఉద్యోగులకు పే స్కేలు సవరణ
- మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
- ప్రభుత్వ ప్రకటనలకు రూ.వెయ్యి కోట్లు
- మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం రూ.1,500 కోట్లు
- ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
- ఓల్డ్ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
- యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు
- మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ.200 కోట్లు
- మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు
- విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
- కేసీఆర్ న్యూట్రిషన్ కిట్‌కు రూ.200 కోట్లు
- పల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు రూ.12వేల కోట్లు
- ఆరోగ్యశ్రీకి రూ.14,063 కోట్లు
- పంచాయతీ రాజ్‌కు రూ.31,426 కోట్లు
- రుణమాఫీకి రూ.6,385 కోట్లు
- షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ,.36,750 కోట్లు
- మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
- గ్రామీణ రోడ్లకు రూ.2 వేల కోట్లు
- హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
- పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
- హోంశాఖకు రూ.9,599 కోట్లు
- మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
- రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు
- రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు
- వైద్యారోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
- వ్యవసాయ శాఖకు రూ.26,831
- గిరిజన సంక్షేమం, ప్రభుత్వ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
- నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు
- కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు
- ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
- విద్యుత్ రంగానికి రూ.12,727 కోట్లు
- ఆయిల్ ఫామ్‌కు రూ.వెయ్యి కోట్లు
- దళిత బంధుకు రూ.17,700 కోట్లు
- ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు